ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరలింపు

జమ్మూ – కశ్మీర్ లో త్వరితగతిన వివిధ కార్యక్రమాలను చేపడుతున్న కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాదు దాన్ని వెంటనే అమలు చేసేసింది. జమ్మూ – కశ్మీర్ లో వివిధ జైళ్ళల్లో ఉన్న 70 మంది ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను అక్కడి నుంచి తరలించింది కేంద్ర ప్రభుత్వం. వీరందరినీ ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఆగ్రా తరలించినట్లుగా సమాచారం. జమ్మూ – కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, 37 ఏ రద్దు […]

Advertisement
Update: 2019-08-08 22:24 GMT

జమ్మూ – కశ్మీర్ లో త్వరితగతిన వివిధ కార్యక్రమాలను చేపడుతున్న కేంద్రం తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నిర్ణయం తీసుకోవడమే కాదు దాన్ని వెంటనే అమలు చేసేసింది.

జమ్మూ – కశ్మీర్ లో వివిధ జైళ్ళల్లో ఉన్న 70 మంది ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను అక్కడి నుంచి తరలించింది కేంద్ర ప్రభుత్వం. వీరందరినీ ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఆగ్రా తరలించినట్లుగా సమాచారం.

జమ్మూ – కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, 37 ఏ రద్దు వంటి కీలక నిర్ణయాలతో పాటు అసెంబ్లీ, కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉభయ సభల్లోనూ తీర్మానాలు చేసింది. ఇది జరిగి రెండు రోజులు కాకముందే మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్రం.

జమ్మూ – కశ్మీర్ లో వివిధ జైళ్లలో ఉన్న 70 మందిని అక్కడి నుంచి తరలించాలని అప్పటికప్పుడు నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా వారిని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తరలించే పనిని కూడా పూర్తి చేసింది.

కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా ఇంతకు ముందు పుల్వామాలో జరిగిన దాడి వంటిదే జరిగే అవకాశం ఉందని అంచనా వేసిన కేంద్రం…. ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను తరలించిందని అంటున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ థోవల్ జమ్మూ- కశ్మీర్ లో పర్యటించి 24 గంటలు కాకముందే కేంద్రం ఉగ్రవాదులను, వేర్పాటు వాదులను అక్కడి నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

మరో వారం రోజుల్లో మరిన్ని సంచలన నిర్ణయాలను కేంద్రం తీసుకునే అవకాశం ఉందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా జమ్మూ – కశ్మీర్ లో పర్యటించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాంమాధవ్ తో పాటు మరికొందరు సీనియర్ నాయకులను కూడా జమ్మూ – కశ్మీర్ పంపించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News