ట్రెండింగ్ ఓకే.. క్లారిటీ ఎక్కడ సాహో

సాహో సినిమాపై ఓవైపు నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ట్రెండింగ్ అవుతోంది. విడుదలవుతున్న ప్రతి ఎలిమెంట్ వైరల్ అవుతోంది. చివరికి అది పోస్టర్ అయినా ట్రెండింగ్ అవ్వాల్సిందే. తాజాగా అదే జరిగింది. సాహోకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇన్నాళ్లూ యాక్షన్ స్టిల్స్ రిలీజ్ చేసిన యూనిట్, ఫస్ట్ టైమ్ ఓ రొమాంటిక్ స్టిల్ విడుదల చేసింది. ఏ చోటు నువ్వున్నా అనే లిరిక్స్ […]

Advertisement
Update: 2019-07-23 21:13 GMT

సాహో సినిమాపై ఓవైపు నెగెటివ్ టాక్ నడుస్తున్నప్పటికీ మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ట్రెండింగ్ అవుతోంది. విడుదలవుతున్న ప్రతి ఎలిమెంట్ వైరల్ అవుతోంది. చివరికి అది పోస్టర్ అయినా ట్రెండింగ్ అవ్వాల్సిందే. తాజాగా అదే జరిగింది. సాహోకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఇన్నాళ్లూ యాక్షన్ స్టిల్స్ రిలీజ్ చేసిన యూనిట్, ఫస్ట్ టైమ్ ఓ రొమాంటిక్ స్టిల్ విడుదల చేసింది. ఏ చోటు నువ్వున్నా అనే లిరిక్స్ తో సాగే పాటకు సంబంధించిన స్టిల్ ఇది. ఈ సాంగ్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ రొమాంటిక్ స్టిల్ బయటకొచ్చింది. కాకపోతే అది అఫీషియల్ కాదు, లీకైన స్టిల్. ఇప్పుడు రిలీజైన స్టిల్ మాత్రం అధికారికం.

అంతా బాగానే ఉంది కానీ ఈ పోస్టర్ లో కూడా సంగీత దర్శకులపై క్లారిటీ ఇవ్వలేదు. సాహో సినిమాకు ఎంతమంది సంగీతం అందిస్తున్నారు, వాళ్ల పేర్లు ఏంటి అనే విషయాన్ని మేకర్స్ చెప్పలేదు. ఇప్పుడు రిలీజైన పోస్టర్ లో కూడా ఆ పేర్లు మిస్సింగ్.

ఈ సినిమాకు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మేకర్స్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కానీ అతడి పేరు కూడా పోస్టర్ లో కనిపించలేదు. కనీసం సినిమా టైటిల్ కార్డులోనైనా పేర్లు వేస్తారో వేయరో.

‪Buckle up! We're coming to you on 30th Aug. #Saaho releasing worldwide on 30.08.2019! #30thAugWithSaaho‬‪Prabhas Shraddha Kapoor Neil Nitin Mukesh Arun Vijay Sujeeth UV Creations #BhushanKumar T-Series Films

Posted by Saaho on Monday, 22 July 2019

Tags:    
Advertisement

Similar News