అమరావతి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న మరో బ్యాంక్‌

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంకు నో చెప్పింది. చంద్రబాబు హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని… పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కారని పలు ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకుకు వెళ్లాయి. దాంతో తాను పూర్తి స్థాయి తనిఖీ చేస్తామంటూ ప్రపంచ బ్యాంకు మెలిక పెట్టింది. అలా చేస్తే మొత్తం వ్యవహరం బయటపడడంతో పాటు దేశంలోని ఇతర ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర […]

Advertisement
Update: 2019-07-23 23:57 GMT

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంకు నో చెప్పింది. చంద్రబాబు హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని… పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కారని పలు ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకుకు వెళ్లాయి. దాంతో తాను పూర్తి స్థాయి తనిఖీ చేస్తామంటూ ప్రపంచ బ్యాంకు మెలిక పెట్టింది.

అలా చేస్తే మొత్తం వ్యవహరం బయటపడడంతో పాటు దేశంలోని ఇతర ప్రాజెక్టులపైనా తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం …అమరావతి ప్రాజెక్టుకు లోన్ అవసరం లేదని వరల్డ్ బ్యాంకుకు స్పష్టం చేసింది. దాంతో రాజధాని ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు వరల్డ్ బ్యాంకు ప్రకటించింది.

ప్రపంచ బ్యాంకు తప్పుకున్న నేపథ్యంలో ఆసియా ఇన్‌ఫాస్ట్రక్చర్‌ బ్యాంకు – ఏఐఐబీ కూడా అమరావతి ప్రాజెక్టుకు తాము రుణం ఇవ్వడం లేదని ప్రకటించింది. అమరావతి ప్రాజెక్టు ఫలితాలను ఇచ్చే ప్రాజెక్టుగా కనిపించడం లేదని అందుకే తప్పుకున్నట్టుగా బ్యాంకు ప్రతినిధి వెల్లడించారు. చైనాలోని బీజింగ్ వేదికగా ఏఐఐబీ పనిచేస్తోంది.

రాజధాని నిర్మాణానికి ఏఐఐబీ 1400 కోట్ల రుణం ఇచ్చేందుకు ఒక దశలో ముందుకొచ్చింది. ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి బ్యాంకు పూర్తి కారణాలను వెల్లడించకపోయినప్పటికీ… ప్రపంచ బ్యాంకు చూపిన కారణాలతోనే ఏఐఐబీ కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News