మొదటి పోస్ట్ అమ్మకు అంకితం

సోషల్ మీడియాలో రామ్ చరణ్ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. మొన్నటివరకు అసలు సోషల్ మీడియాలో చరణ్ కనిపించేవాడు కాదు. కానీ ఇప్పుడిప్పుడే ఫేస్ బుక్, ట్విట్టర్ లో చరణ్ చురుగ్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కూడా చేరాడు చరణ్. తను ఇన్ స్టాగ్రామ్ లో చేరబోతున్నాననే విషయాన్ని చరణ్ నిన్ననే అఫీషియల్ గా ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఈరోజు తొలి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ను అమ్మకు అంకితం […]

Advertisement
Update: 2019-07-12 20:07 GMT

సోషల్ మీడియాలో రామ్ చరణ్ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. మొన్నటివరకు అసలు సోషల్ మీడియాలో చరణ్ కనిపించేవాడు కాదు. కానీ ఇప్పుడిప్పుడే ఫేస్ బుక్, ట్విట్టర్ లో చరణ్ చురుగ్గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కూడా చేరాడు చరణ్.

తను ఇన్ స్టాగ్రామ్ లో చేరబోతున్నాననే విషయాన్ని చరణ్ నిన్ననే అఫీషియల్ గా ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఈరోజు తొలి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ను అమ్మకు అంకితం ఇచ్చాడు. చిన్నప్పుడు అమ్మతో దిగిన ఫొటోను, తాజాగా అమ్మతో కలిసి దిగిన మరో ఫొటోతో జతచేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు చరణ్. “కొన్ని విషయాలు అస్సలు మారవు. నా మొదటి పోస్ట్ అమ్మకు అంకితం. లవ్ యు అమ్మ” అంటూ తొలి పోస్ట్ పెట్టాడు రామ్ చరణ్.

మొన్నటివరకు రామ్ చరణ్ కు చెందిన సోషల్ మీడియా వ్యవహారాల్ని అతడి భార్య ఉపాసన చూసుకునేది. కానీ ఇప్పుడు స్వయంగా చరణ్ రంగంలోకి దిగాడు. తను ఇకపై సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటానని, గతంలోనే ప్రకటించాడు చెర్రీ. చెప్పినట్టుగానే ఇప్పుడు ఒక్కొక్క సామాజిక మాధ్యమం పైకి వస్తున్నాడు. చరణ్ ఇన్ స్టాగ్రామ్ లోకి కూడా రావడంతో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News