మరోసారి సీత గా.... నయనతార?

తమిళ పరిశ్రమ లో ప్రస్తుతం నయనతార టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలతో ముందుకెళ్తోంది. అయితే డైరెక్టర్ ఎవరైనా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి అనుకుంటే ముందుగా అప్రోచ్ అయ్యేది నయనతారనే… అయితే  కథ తో పాటు తన పాత్ర కి ప్రాముఖ్యత ఉంటేనే ఓకే చేస్తోంది నయన్. అయితే తాజా గా వినిపిస్తున్న కథనాల ప్రకారం నయనతార ఒక భారీ బడ్జెట్ లో నటించనుందని తెలుస్తోంది. అయితే ఇది అల్లు అరవింద్ త్వరలో భారీ బడ్జెట్ […]

Advertisement
Update: 2019-07-13 01:30 GMT

తమిళ పరిశ్రమ లో ప్రస్తుతం నయనతార టాప్ హీరోయిన్ గా వరుస సినిమాలతో ముందుకెళ్తోంది. అయితే డైరెక్టర్ ఎవరైనా ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయాలి అనుకుంటే ముందుగా అప్రోచ్ అయ్యేది నయనతారనే… అయితే కథ తో పాటు తన పాత్ర కి ప్రాముఖ్యత ఉంటేనే ఓకే చేస్తోంది నయన్.

అయితే తాజా గా వినిపిస్తున్న కథనాల ప్రకారం నయనతార ఒక భారీ బడ్జెట్ లో నటించనుందని తెలుస్తోంది. అయితే ఇది అల్లు అరవింద్ త్వరలో భారీ బడ్జెట్ తో, పెద్ద స్కేల్ మీద నిర్మించబోతున్న రామాయణం సినిమా కోసమట. ఈ సినిమా ని ఇటీవలే అధికారికం గా ప్రకటించిన నిర్మాతలు, కాస్టింగ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

రామాయణం అంటే మాములు విషయం కాదు…. చాలా మంది నటులు కావాలి. అందుకనే ఎలాగైనా సరే మంచి నటుల్ని ఎంపిక చేయాలనే తలంపుతో ఉన్నారట.

ఆల్రెడీ శ్రీ రామ రాజ్యం సినిమా లో సీత పాత్ర లో నటించిన నయనతార ని మళ్ళీ సీత పాత్రకి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి…. మరి నయన్ కి కూడా ఈ ప్రపోజల్ నచ్చితే మళ్ళీ సీత లా నటించడానికి రెడీ అవుతుందేమో చూడాలి..!

Tags:    
Advertisement

Similar News