కరణంపై హైకోర్టుకు ఆమంచి...

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టుకు వెళ్లారు. కరణం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని… కాబట్టి వేటు వేయాలని కోరారు. చట్ట ప్రకారం వెల్లడించాల్సిన పలు అంశాలను కరణం బలరాం దాచిపెట్టారని ఆమంచి ఆరోపించారు. తన అఫిడవిట్‌లో భార్యగా కరణం సరస్వతిని మాత్రమే చూపారని… మరో భార్య ప్రసూన గురించి మాత్రం ప్రస్తావించలేదని ఆమంచి […]

Advertisement
Update: 2019-07-06 22:24 GMT

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టుకు వెళ్లారు. కరణం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని… కాబట్టి వేటు వేయాలని కోరారు.

చట్ట ప్రకారం వెల్లడించాల్సిన పలు అంశాలను కరణం బలరాం దాచిపెట్టారని ఆమంచి ఆరోపించారు. తన అఫిడవిట్‌లో భార్యగా కరణం సరస్వతిని మాత్రమే చూపారని… మరో భార్య ప్రసూన గురించి మాత్రం ప్రస్తావించలేదని ఆమంచి వివరించారు. ప్రసూన ఆస్తులు, ఆదాయం గురించి అఫిడవిట్‌లో వివరించలేదన్నారు.

ప్రసూనను 1985లో కుటుంబసభ్యుల సమక్షంలోనే శ్రీశైలంలో కరణం బలరాం వివాహం చేసుకున్నారని… వీరికి 1989లో కుమార్తె కూడా జన్మించిందని ఆమంచి వివరించారు. కరణం కుమార్తె అంబిక కృష్ణ ఆధార్‌ కార్డులో కూడా తండ్రి పేరుగా కరణం బలరాం పేరు ఉందని వెల్లడించారు.

ఇలా భార్య, పిల్లల వివరాలు దాచిపెట్టి అఫిడవిట్ వేయడం చట్టవిరుద్దమని… కాబట్టి కరణం బలరాంను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News