సమంత చేయాలనుకుంది.... కానీ చైతన్య చేసేస్తున్నాడు

సమంత ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ లో చాలా ఆసక్తికర విషయాలని చెబుతోంది. ఏ డైరెక్టర్ తో పని చేయాలని ఉంది అని సమంత ని అడగగా, సమంత దానికి తెలివైన సమాధానమే ఇచ్చింది. “హీరోయిన్ల కి సినిమాల్లో అందమైన పాత్రలని సృష్టించే శేఖర్ కమ్ముల తో నాకు ఎప్పటి నుంచో పని చేయాలని ఉంది. ఆయన చాలా బాగా హీరోయిన్ల క్యారెక్టర్స్ ని రాస్తారు, ఒక్క సారైనా ఆయన దర్శకత్వం లో చేయాలి అని ఉంది. […]

Advertisement
Update: 2019-07-05 01:30 GMT

సమంత ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ లో చాలా ఆసక్తికర విషయాలని చెబుతోంది. ఏ డైరెక్టర్ తో పని చేయాలని ఉంది అని సమంత ని అడగగా, సమంత దానికి తెలివైన సమాధానమే ఇచ్చింది.

“హీరోయిన్ల కి సినిమాల్లో అందమైన పాత్రలని సృష్టించే శేఖర్ కమ్ముల తో నాకు ఎప్పటి నుంచో పని చేయాలని ఉంది. ఆయన చాలా బాగా హీరోయిన్ల క్యారెక్టర్స్ ని రాస్తారు, ఒక్క సారైనా ఆయన దర్శకత్వం లో చేయాలి అని ఉంది. అంతే కాకుండా అందరు హీరోయిన్ల లాగానే నాకు కూడా మణిరత్నం గారితో పని చేయాలని ఎప్పటి నుంచో ఉంది” అని సమంత చెప్పుకొచ్చింది.

ఆసక్తికర అంశం ఏంటి అంటే సమంత శేఖర్ కమ్ముల తో సినిమా చేయాలని అనుకుంది…. కానీ నాగ చైతన్య ఆ ఛాన్స్ కొట్టేసాడు. శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.

అయితే సమంత అనుకుంది… కానీ నాగచైతన్య శేఖర్ కమ్ములతో సినిమా చేసేస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News