జగన్ హౌసింగ్‌ ప్లాన్ ఏంటి?

ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లపైనా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. అర్బన్ హౌసింగ్ కింద కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా పేదలపై అప్పు భారం లేకుండా చేస్తామని జగన్‌ చెబుతున్నారు. ఈ అంశంపై జగన్‌ మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు పాదయాత్ర సమయంలో కూడా స్పష్టత ఇస్తూ వచ్చారు. సాధారణంగా ప్రభుత్వమే స్థలం ఇస్తున్నప్పుడు, లగ్జరీ సదుపాయాలు లేకుండా నిర్మించే ఇళ్లకు చదరపు అడుగుకు 1100 అవుతుందని జగన్‌ […]

Advertisement
Update: 2019-07-03 09:36 GMT

ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న ఇళ్లపైనా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించారు. అర్బన్ హౌసింగ్ కింద కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా పేదలపై అప్పు భారం లేకుండా చేస్తామని జగన్‌ చెబుతున్నారు.

ఈ అంశంపై జగన్‌ మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు పాదయాత్ర సమయంలో కూడా స్పష్టత ఇస్తూ వచ్చారు. సాధారణంగా ప్రభుత్వమే స్థలం ఇస్తున్నప్పుడు, లగ్జరీ సదుపాయాలు లేకుండా నిర్మించే ఇళ్లకు చదరపు అడుగుకు 1100 అవుతుందని జగన్‌ ఎన్నికల ముందే చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 2,300 రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.

దీని వల్ల 300 చదరపు అడుగుల్లో నిర్మించే ఇంటికి ఆరు లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. ఈ ఆరు లక్షల్లో కేంద్రం లక్షన్నర రూపాయలు సబ్సిడీ భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర సబ్సిడీ భరిస్తోంది. ఇక మిగిలిన మూడు లక్షల రూపాయలు ఇల్లు తీసుకునే లబ్ది దారుడే బ్యాంక్ లోన్ రూపంలో నెలకు మూడు వేల చొప్పున ఏళ్ల తరబడి చెల్లించాల్సి ఉంటుందని గత ప్రభుత్వం ప్రకటించింది.

కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, కమిషన్లు తీసుకునే అలవాటు మానుకుని ఉంటే… చదరపు అడుగు నిర్మాణం 1100లతోనే చేయవచ్చని… అప్పుడు 300 చదరపు అడుగుల నిర్మాణం మూడు లక్షలకు అటుఇటుగానే పూర్తవుతుందని జగన్‌ చెబుతూ వచ్చారు. ఆ మూడు లక్షలు ఎలాగో కేంద్రం లక్షన్నర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే లక్షన్నర సబ్సిడీకి సరిపోతుంది కాబట్టి… ఇక లబ్దిదారులు ఏళ్ల తరబడి బ్యాంకులకు ఇన్‌స్టాల్ మెంట్లు కట్టాల్సిన పని ఉండదని జగన్ చెబుతున్నారు.

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ కి పిలిచి ఇంటి నిర్మాణం చదరపు అడుగుకు వెయ్యి రూపాయలు లేదా 1100లకు పరిమితం చేస్తే మూడు లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తవుతుంది అన్నది జగన్‌ ఆలోచన.

అప్పుడు లబ్ది దారుడు బ్యాంకులకు అప్పు కడుతూ ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతోనే లబ్దిదారుడికి ఇల్లు దక్కుతుంది.

Advertisement

Similar News