నేడు, రేపు ఏపీ ఎమ్మెల్యే లకు శిక్షణ

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బుధ, గురువారాలలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలువురు నిపుణులు అనేక సూచనలు, సలహాలు ఇస్తారు. ఈసారి శాసనసభకు ఎక్కువమంది తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడం, శాసనసభ వ్యవహారాల పట్ల వారికి అవగాహన లేకపోవడంతో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, బడ్జెట్ పై ప్రసంగించడంతో పాటు […]

Advertisement
Update: 2019-07-02 21:44 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు, శాసనమండలి సభ్యులకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

బుధ, గురువారాలలో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలువురు నిపుణులు అనేక సూచనలు, సలహాలు ఇస్తారు. ఈసారి శాసనసభకు ఎక్కువమంది తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కావడం, శాసనసభ వ్యవహారాల పట్ల వారికి అవగాహన లేకపోవడంతో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, బడ్జెట్ పై ప్రసంగించడంతో పాటు వివిధ బిల్లులపై జరిగే చర్చల్లో ఎలా మాట్లాడాలో నిపుణులు వారికి సలహాలు, సూచనలు ఇస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు.

నేటితరం ఎమ్మెల్యేలు అనే అంశంపై సీనియర్ శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఈ శిక్షణా కార్యక్రమంలో ఉపన్యసిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతారా…? లేదా…? అన్నది ఇంకా తేలలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది సీనియర్ శాసనసభ్యులే కావడంతో వారు శిక్షణా కార్యక్రమాలకు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శాసనసభలో జనసేన పార్టీ శాసనసభ్యుడు ఒక్కరే ఉండడం, ఆయన కూడా కొత్త వారే కావడంతో శిక్షణా కార్యక్రమాలలో ఆయన పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News