ఇంగ్లండ్ ప్రత్యర్థిగా గేల్ అత్యధిక పరుగుల రికార్డు

ప్రపంచకప్ మ్యాచ్ లో గేల్ 36 పరుగులు 1632 పరుగులతో క్రిస్ గేల్ టాప్ ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు. సౌతాంప్టన్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో గేల్ మొత్తం 41 బాల్స్ ఎదుర్కొని 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 36 పరుగులు సాధించడం ద్వారా…ఇంగ్లండ్ పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు. గేల్ మొత్తం 36 […]

Advertisement
Update: 2019-06-14 23:50 GMT
  • ప్రపంచకప్ మ్యాచ్ లో గేల్ 36 పరుగులు
  • 1632 పరుగులతో క్రిస్ గేల్ టాప్

ఇంగ్లండ్ ప్రత్యర్థిగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విండీస్ సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డు నెలకొల్పాడు.

సౌతాంప్టన్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ మ్యాచ్ లో గేల్ మొత్తం 41 బాల్స్ ఎదుర్కొని 5 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 36 పరుగులు సాధించడం ద్వారా…ఇంగ్లండ్ పై అత్యధిక వన్డే పరుగులు సాధించిన క్రికెటర్ గా నిలిచాడు.

గేల్ మొత్తం 36 ఇన్నింగ్స్ లో 1632 పరుగులు సాధించడం ద్వారా…వీవ్ రిచర్డ్స్ పేరుతో ఉన్న 1619 పరుగుల రికార్డును అధిగమించాడు.

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర మొత్తం 44 ఇన్నింగ్స్ లో సాధించిన 1625 పరుగుల రికార్డు సైతం తెరమరుగయ్యింది.
రికీ పాంటింగ్ 1592, మహేల జయవర్థనే 1562 పరుగులు సాధించడం ద్వారా టాప్ ఫైవ్ లో నిలిచారు.

Advertisement

Similar News