ప్రపంచకప్ లో నాలుగో శతకం

పాక్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ మొదటి 17 మ్యాచ్ ల్లో నాలుగే శతకాలు ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ..మొదటి 17 రౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఈ నాలుగు శతకాలలో ఆతిథ్య ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లే రెండు సాధించడం విశేషం. ప్రస్తుత ప్రపంచకప్ లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడి గౌరవాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ దక్కించుకొన్నాడు. రెండో సెంచరీని సైతం […]

Advertisement
Update: 2019-06-12 11:35 GMT
  • పాక్ పై డేవిడ్ వార్నర్ సెంచరీ
  • మొదటి 17 మ్యాచ్ ల్లో నాలుగే శతకాలు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న 2019 ఐసీసీ వన్డే ప్రపంచకప్ ..మొదటి 17 రౌండ్ల మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.

ఈ నాలుగు శతకాలలో ఆతిథ్య ఇంగ్లండ్ టాపార్డర్ ఆటగాళ్లే రెండు సాధించడం విశేషం.

ప్రస్తుత ప్రపంచకప్ లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడి గౌరవాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ దక్కించుకొన్నాడు.
రెండో సెంచరీని సైతం ఇంగ్లండ్ ఓపెనర్ జే సన్ రాయ్ సాధించాడు.

ఆసీస్ పై ధావన్ సెంచరీ…

ఆస్ట్రేలియాతో ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ స్ర్టోక్ ఫుల్ సెంచరీ సాధించడం ద్వారా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

ఇక…పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనదైన స్టయిల్లో మెరుపు సెంచరీ నమోదు చేశాడు.

బాల్ టాంపరింగ్ ఆరోపణలతో ఏడాదికాలం నిషేధం ఎదుర్కొన్న వార్నర్…ప్రస్తుత ప్రపంచకప్ లో తమ జట్టు ఆడిన మూడోరౌండ్ మ్యాచ్ లోనే శతకం బాదాడు.

టాంటన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో వార్నర్ 111 బాల్స్ ఎదుర్కొని ..ఒకేఒక్క సిక్సర్, 11 బౌండ్రీలతో 107 పరుగుల స్కోరు సాధించి అవుటయ్యాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో సెంచరీబాదిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా వార్నర్ రికార్డుల్లో చేరాడు. వార్నర్ వన్డే కెరియర్ లో ఇది 15వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

Tags:    
Advertisement

Similar News