అలాంటి పాత్రలో నటించాకే రిటైర్ మెంట్ అవుతా " సమంత

ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత పెళ్లి తర్వాత మాత్రం రూటు మార్చిన సంగతి తెలిసిందే. నటనకు స్కోప్ ఉన్న పాత్ర లను ఎంచుకోవడం మాత్రమే కాక వరుసగా బ్లాక్ బస్టర్ లు కూడా అందుకుంటోంది. తాజాగా ‘యూటర్న్’ మరియు ‘మజిలీ’ సినిమాలతో హిట్లని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ‘ఓ బేబి’ సినిమాతో బిజీగా ఉన్న ఈమె కి ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయాలని ఉందట. నిజానికి […]

Advertisement
Update: 2019-06-07 03:26 GMT

ఇప్పటిదాకా కమర్షియల్ సినిమాల లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత పెళ్లి తర్వాత మాత్రం రూటు మార్చిన సంగతి తెలిసిందే. నటనకు స్కోప్ ఉన్న పాత్ర లను ఎంచుకోవడం మాత్రమే కాక వరుసగా బ్లాక్ బస్టర్ లు కూడా అందుకుంటోంది.

తాజాగా ‘యూటర్న్’ మరియు ‘మజిలీ’ సినిమాలతో హిట్లని నమోదు చేసుకుంది. ప్రస్తుతం ‘ఓ బేబి’ సినిమాతో బిజీగా ఉన్న ఈమె కి ఒక ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయాలని ఉందట.

నిజానికి ‘ఓ బేబీ’ సినిమాలో కూడా ఈమె పాత్ర కొంచెం కామెడీని పండిస్తుంది. అయితే సమంతకు ఎప్పటికైనా ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రంలో నటించాలని ఉందట. అలాంటి పాత్ర దొరికితే తప్ప తను సినిమాల నుంచి రిటైర్ అయ్యేది లేదు అని ఖరాకండిగా చెప్పేస్తోంది సమంత.

మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ సినిమా సౌత్ కొరియన్ సూపర్ హిట్ సినిమా ‘మిస్ గ్రాని’ రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా లో నాగశౌర్య హీరోగా నటించాడు. ఈ సినిమాలో 70 ఏళ్ళ ముస్సలావిడ సడన్ గా పాతికేళ్ళ అమ్మాయిగా మారి పోతే ఎలా ఉంటుంది అనే కథనంతో ఈ సినిమా నడుస్తుంది.

Tags:    
Advertisement

Similar News