ఇప్పుడు సమీక్షలు అవసరమా అధ్యక్షా?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన. ఇప్పుడు ఆ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. జిల్లాల వారీగా శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కొందరు కార్యకర్తలతో ఈ సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు జనసేన నుంచి ఒక్కరంటే ఒక్కరే ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం, పార్టీ అధ్యక్షుడు పవన్ […]

Advertisement
Update: 2019-06-06 00:51 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన. ఇప్పుడు ఆ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. జిల్లాల వారీగా శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కొందరు కార్యకర్తలతో ఈ సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కు జనసేన నుంచి ఒక్కరంటే ఒక్కరే ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలలో కూడా ఓటమి పాలు కావడం పార్టీ నాయకులను కలచివేస్తోంది. తామే అధికారంలోకి వస్తామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మెల్లి మెల్లిగా తన మాటను మార్చారు.

ఆంధ్రప్రదేశ్ లో హంగ్ ఏర్పడుతుందని, ఆ సమయంలో జనసేన కీలకం అవుతుందని పార్టీ అభ్యర్థులకు, నాయకులకు పవన్ కల్యాణ్ చెప్పారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికి జనసేనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని అర్థమైంది. ఈ పరాజయాన్ని ఊహించని పవన్ కళ్యాణ్ నిర్వేదంలోకి వెళ్లి పోయారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ఎలా ఓడిపోయింది, దానికి కారణాలు ఏమిటి? వంటి అంశాల పై చర్చించడం వృధా ప్రయాసే అవుతుందని జనసేన నాయకులు అంటున్నారు.

సమీక్ష సమావేశాల పేరుతో అన్ని జిల్లాల నుంచి నాయకులను రప్పించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పటికే కొందరు నాయకులు ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ, అటు ఢిల్లీలోనూ అధికారంలో ఉన్న పార్టీల్లోకి మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని, ఈ సమయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి కొత్తగా సాధించేది ఏమి ఉంటుందని నాయకులు అంటున్నారు.

చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలాంటి ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని వ్యంగ్యంగా అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News