అయ్యో.... పాపం కమ్యూనిస్టులు....

దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి రోజురోజుకూ మరీ దయనీయంగా తయారవుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపిన వామపక్షాలు ప్రస్తుతం ఉనికిని కాపాడుకోవడానికే నానా తంటాలు పడుతున్నాయి. కేరళలో కొద్దిగా ప్రజాభిమానం పొందగలుగుతున్నా, తమకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు కకావికలమైపోయింది. మమతా బెనర్జీ ఎర్ర పార్టీ నేతలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు. త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనూ దారుణ పరాజయాలను మూట గట్టుకోవాల్సి వచ్చింది. […]

Advertisement
Update: 2019-05-18 19:02 GMT

దేశంలో కమ్యూనిస్టుల పరిస్థితి రోజురోజుకూ మరీ దయనీయంగా తయారవుతోంది. ఒకప్పుడు దేశ రాజకీయాల మీద తీవ్ర ప్రభావం చూపిన వామపక్షాలు ప్రస్తుతం ఉనికిని కాపాడుకోవడానికే నానా తంటాలు పడుతున్నాయి.

కేరళలో కొద్దిగా ప్రజాభిమానం పొందగలుగుతున్నా, తమకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు కకావికలమైపోయింది. మమతా బెనర్జీ ఎర్ర పార్టీ నేతలను కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఇంకా తీస్తూనే ఉన్నారు.

త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనూ దారుణ పరాజయాలను మూట గట్టుకోవాల్సి వచ్చింది. దీనికంతటికి కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమే కారణమంటున్నారు రాజకీయ పరిశీలకులు.

కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని, వితండవాద రాజకీయాలు చేస్తూ ప్రజాభిమానానికి దూరమయ్యారని అంటున్నారు. కాలానుగుణంగా మారడంలోనూ, ప్రజల మనోగతం, భావోద్వేగాలకు అనుగుణంగా తమను తాము మలుచుకోవడంలోనూ వామపక్షాల నేతలు విఫలం అయ్యారని చెబుతున్నారు.

రెండున్నర దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సీపీఎం నేత జ్యోతిబసుకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ, తమ సిద్దాంతాలు ఒప్పుకోవంటూ సీపీఎం ఆ అవకాశాన్ని తోసిపుచ్చింది. అదే పార్టీ తదనంతర కాలంలో తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడింది. జ్యోతిబసు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినపుడు కాదనడం చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది.

కానీ, దాని నుంచి పాఠాలు మాత్రం నేర్వలేకపోయింది. మరో సీపీఎం నేత సోమనాథ్ ఛటర్జీ లోక్ సభ స్పీకర్ అయిన కొంతకాలానికి పార్టీ ఆయనను స్పీకర్ పదవికి రాజీనామా చేయమని ఆదేశించింది. ఆ సమయంలో సోమనాథ్ ఛటర్జీ ఈ ఆదేశాలను నిర్ద్వందంగా తిరస్కరించారు. పూర్తికాలం పదవిలో కొనసాగారు.

దీంతో ఆగ్రహం చెందిన పార్టీ ఆయనను దూరంగా ఉంచింది. జీవితమంతా సీపీఎంతోనే గడిపిన సోమనాథ్ ఛటర్జీ చనిపోయాక ఆయన భౌతికకాయం మీద పార్టీ జెండా కప్పడానికి కూడా వెనుకడుగు వేసింది.

ఇలా వామపక్షాలు చారిత్రక తప్పిదాలు ఎన్నో చేస్తూ ప్రజలకు దూరమవుతూ వచ్చాయనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకప్పుడు కనీసం 70‌-80 సీట్లతో లోక్ సభలో కళకళలాడిన లెఫ్ట్ పార్టీలు ప్రస్తుతం 10-20 సీట్లు సాధించుకోవడానికి కూడా తంటాలు పడడం చరిత్రకందని విషాదమే…!

Tags:    
Advertisement

Similar News