బాబు మార్క్ రాజకీయం.... ఎన్నికల కోడ్ ఉల్లంఘించి నియామకాలు?

తెలుగు రాష్ట్రాల్లో బాబుని మించి రాజకీయం చేసే నాయకుడు మరొకరు లేరు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు అధికారం ఉన్నంత వరకు అజమాయిషి చెలాయించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ నెల 23 వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనలు ఉన్నా.. తన పని తాను చేసుకొని పోతున్నారు. తన వాళ్లకు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే కీలక పదవులు కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొందరు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా ఇవ్వాలంటూ కేంద్ర […]

Advertisement
Update: 2019-05-04 21:19 GMT

తెలుగు రాష్ట్రాల్లో బాబుని మించి రాజకీయం చేసే నాయకుడు మరొకరు లేరు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. తనకు అధికారం ఉన్నంత వరకు అజమాయిషి చెలాయించాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ నెల 23 వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదనే నిబంధనలు ఉన్నా.. తన పని తాను చేసుకొని పోతున్నారు. తన వాళ్లకు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే కీలక పదవులు కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల కొందరు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం వివాదాస్పదమైన తర్వాత కూడా మరో నిర్ణయం తీసుకోవడానికి ఆయన సిద్దపడ్డారు. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న రాష్ట్ర సమాచార కమీషనర్లను ఆయన టీడీపీ నాయకులకు కట్టబెట్టాలని అనుకుంటున్నారు. ఈ మేరకు మార్చి 29న ఇద్దరు టీడీపీ నాయకుల పేర్లను ప్రతిపాదిస్తూ.. వారిని సమాచార కమిషనర్లుగా నియమించాలని ప్రతిపాదించారు.

వాస్తవానికి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అంటే ఆనాటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కాని కోడ్‌ను సైతం బేఖాతరు చేస్తూ చంద్రబాబు తన నియామకాలను కొనసాగించారు. అసలు సమాచార కమిషనర్లను నియమించాలంటే… ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి ఆధ్వర్యంలో జరగాలి. కాని అసలు అలాంటి కమిటీనే లేనప్పుడు ఈ నియామకాలు ఎలా చేస్తారనే విమర్శలు వస్తున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత హడావిడిగా విజయవాడలోని హోటల్ ఐలాపురం ఓనర్ కొడుకైన రాజా, విశాఖకు చెందిన ఈర్ల రామ్మూర్తి పేర్లను ప్రతిపాదిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల సంఘానికి కూడా నివేదించారు.

Tags:    
Advertisement

Similar News