డబుల్ మాస్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్న లారెన్స్

‘ముని’ సిరీస్‌లో నాలుగో భాగంగా, ‘కాంచన’ సిరీస్ లో మూడవ భాగంగా ‘కాంచ‌న 3’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడం మాత్రమే కాక చిత్రంలో ముఖ్యపాత్ర కూడా పోషించారు. వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. తమిళ వెర్షన్ […]

Advertisement
Update: 2019-03-28 01:25 GMT

‘ముని’ సిరీస్‌లో నాలుగో భాగంగా, ‘కాంచన’ సిరీస్ లో మూడవ భాగంగా ‘కాంచ‌న 3’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడం మాత్రమే కాక చిత్రంలో ముఖ్యపాత్ర కూడా పోషించారు.

వేదిక‌, నిక్కీ తంబోలి, ఓవియా క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు.

తమిళ వెర్షన్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. పేరుకి హారర్ కామెడీ అయినప్పటికీ, ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్నఈ ట్రైలర్ లో ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులోని స‌న్నివేశాలు భ‌యంక‌రంగా ఉన్నాయి. ముఖ్య ఆకర్షణ మాత్రం లారెన్స్ అద్భుతమైన ప‌ర్‌ఫార్మెన్స్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైలర్ ఆఖరిలో “నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్” అని చెప్పే డైలాగు బావుంది.

ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమ్రేష్ గణేష్ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదల కావాల్సి ఉంది.

Hi dear Friends and Fans..! Here’s the #Kanchana3Trailer I hope you all enjoy it… http://youtu.be/-16MdQ9Blgk

Posted by Raghava Lawrence on Wednesday, 27 March 2019

Tags:    
Advertisement

Similar News