చేతులెత్తేసిన టీడీపీ
తెలంగాణలో టీడీపీ దాదాపు జెండా పీకేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొడకొట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ… లోక్సభ ఎన్నికల్లో మాత్రం అసలు పోటీనే చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తైపోవడం, సీనియర్లు ఎవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది. ఖమ్మం నుంచి నామానాగేశ్వరరావును పోటీ చేయించాలనుకున్నారు. కానీ ఈయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ ప్రచారం చేయడంతో పాటు, మద్దతు ఇవ్వనుంది. ఇప్పటికే […]
తెలంగాణలో టీడీపీ దాదాపు జెండా పీకేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొడకొట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ… లోక్సభ ఎన్నికల్లో మాత్రం అసలు పోటీనే చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చిత్తైపోవడం, సీనియర్లు ఎవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించుకుంది.
ఖమ్మం నుంచి నామానాగేశ్వరరావును పోటీ చేయించాలనుకున్నారు. కానీ ఈయన కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ ప్రచారం చేయడంతో పాటు, మద్దతు ఇవ్వనుంది. ఇప్పటికే టీడీపీ పెద్దలతో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు. కాంగ్రెస్కు మద్దతుపై ఒకటి రెండు రోజుల్లో టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.