బాలకృష్ణ అల్లుడిపై మాజీ జేడీ పోటీ

జనసేన అభ్యర్థుల ప్రకటనలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్‌ కల్యాణ్ రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన్ను లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు. ఆయన పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. దీంతో విశాఖలో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ తరపున ఎంవీవీ సత్యనారాయణ బరిలో ఉన్నారు. టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు […]

Advertisement
Update: 2019-03-19 06:54 GMT

జనసేన అభ్యర్థుల ప్రకటనలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్‌ కల్యాణ్ రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా అసెంబ్లీకి పోటీ చేస్తారని భావించారు. కానీ ఆయన్ను లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ పోటీ చేయబోతున్నారు.

ఆయన పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. దీంతో విశాఖలో పోరు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ తరపున ఎంవీవీ సత్యనారాయణ బరిలో ఉన్నారు. టీడీపీ తరపున బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జనసే నుంచి లక్ష్మీనారాయణ బరిలోకి దిగుతుండడంతో ఇక్కడ ఫైట్ సీరియస్‌గా ఉండే అవకాశం ఉంది.

మంగళగిరిలో నారా లోకేష్‌పై జనసేన అభ్యర్థిని నిలపకుండా సీపీఐకి కేటాయించిన పవన్‌ కల్యాణ్… విశాఖలో మాత్రం బాలకృష్ణ మరో అల్లుడిపై ఏకంగా మాజీ జేడీని బరిలో దింపడం ఆసక్తిగా ఉంది. నిజానికి భరత్‌కు విశాఖ టికెట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదన్న ప్రచారం సాగింది. బాలకృష్ణ అల్టిమేటం జారీ చేయడంతో భరత్‌కు టికెట్‌ ఇచ్చారు. భరత్‌ను ఓడించేందుకు ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News