టీడీపీకి ఎస్పీవై రెడ్డి బిగ్ షాక్

2014లో వైసీపీ తరపున గెలిచిన టీడీపీలో చేరిన మరో ఎంపీకి చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. దీంతో తిరిగి టీడీపీకి ఫిరాయింపు ఎంపీ షాక్ ఇచ్చారు. నంద్యాల ఎంపీగా వైసీపీ తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు. ఈసారి కూడా ఆయన ఎంపీగా పోటీ చేయడంతో పాటు, అల్లుడికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు హ్యాండిచ్చారు. దీంతో టీడీపీకి ఎస్పీవై రెడ్డి గుడ్‌ బై చెప్పారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తనను నమ్మించి, […]

Advertisement
Update: 2019-03-18 20:30 GMT

2014లో వైసీపీ తరపున గెలిచిన టీడీపీలో చేరిన మరో ఎంపీకి చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. దీంతో తిరిగి టీడీపీకి ఫిరాయింపు ఎంపీ షాక్ ఇచ్చారు. నంద్యాల ఎంపీగా వైసీపీ తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి ఎన్నికల అనంతరం టీడీపీలో చేరారు.

ఈసారి కూడా ఆయన ఎంపీగా పోటీ చేయడంతో పాటు, అల్లుడికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు హ్యాండిచ్చారు. దీంతో టీడీపీకి ఎస్పీవై రెడ్డి గుడ్‌ బై చెప్పారు.

ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తనను నమ్మించి, ఆశలు పెంచి మోసం చేశారని ఎస్పీవై రెడ్డి ఆరోపించారు. వచ్చే గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అల్లుడి చేత నంద్యాల అసెంబ్లీకి కూడా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయించనున్నారు.

Tags:    
Advertisement

Similar News