ఒకటి ఒకటి కలిస్తే రెండు కాదు... నేను, పవన్‌ పదకొండు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. తొలుత టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. కానీ చంద్రబాబుకు, లక్ష్మీనారాయణకు మధ్య ఉన్న అనుబంధం బయటపడిందని ప్రతిపక్షాలు విమర్శించడంతో మాజీ జేడీ వెనక్కు తగ్గారు. నేడు జనసేనలో చేరారు. ఈసందర్భంగా మాట్లాడిన మాజీ జేడీ… 2014లో పార్టీ పెడుదామని పవన్‌ కల్యాణ్ ఆహ్వానించారని… కానీ ఆ సమయంలో తనకున్న బాధ్యతల రీత్యా రాలేకపోయానన్నారు. ఏదో ఒకరోజు కలిసి పనిచేద్దామని పవన్ చెప్పారని.. ఆ రోజు ఈ రోజు అయిందన్నారు. యువత ఎంతో ఆశతో ఉందన్నారు. పవన్‌ కల్యాణ్ […]

Advertisement
Update: 2019-03-17 02:06 GMT

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. తొలుత టీడీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. కానీ చంద్రబాబుకు, లక్ష్మీనారాయణకు మధ్య ఉన్న అనుబంధం బయటపడిందని ప్రతిపక్షాలు విమర్శించడంతో మాజీ జేడీ వెనక్కు తగ్గారు. నేడు జనసేనలో చేరారు.

ఈసందర్భంగా మాట్లాడిన మాజీ జేడీ… 2014లో పార్టీ పెడుదామని పవన్‌ కల్యాణ్ ఆహ్వానించారని… కానీ ఆ సమయంలో తనకున్న బాధ్యతల రీత్యా రాలేకపోయానన్నారు. ఏదో ఒకరోజు కలిసి పనిచేద్దామని పవన్ చెప్పారని.. ఆ రోజు ఈ రోజు అయిందన్నారు. యువత ఎంతో ఆశతో ఉందన్నారు.

పవన్‌ కల్యాణ్ ప్రకటించిన మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ప్రకటించి ఉండదన్నారు. ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు 11 అవుతుందన్నారు. తాను, పవన్‌ కల్యాణ్‌ కూడా 11 అవుతామన్నారు. జ్ఞానం, ధైర్యం, ప్రజాకర్షణ మూడు ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్ మాత్రమేనన్నారు. ఈ క్షణం నుంచి తాను కూడా ఒక జనసైనికుడినని చెప్పారు.

Ex CBI JD Lakshmi Narayana joined JanaSena Party

Posted by JanaSena Party on Saturday, 16 March 2019

Tags:    
Advertisement

Similar News