వైఎస్‌ వివేకా మృతిపై.... మాపై ఆరోపణలు అవాస్తవం....

వైఎస్ వివేకా మృతిపై వైసీపీ వాళ్లు దర్యాప్తుకు డిమాండ్ చేశారని…. తాము కూడా దర్యాప్తు జరిగి నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి. సుధీర్ఘకాలం పాటు తాము, వివేకా కలిసి పనిచేశామన్నారు. వైఎస్ వివేకా మరణం విషయంలో తనపైనా, చంద్రబాబుపైనా కొందరు ఆరోపణలు చేస్తున్నారని…. కాబట్టి దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. తప్పు చేసి ఉంటే ఉరి తీయాలన్నారు. జగన్‌పై దాడి సమయంలోనూ ఇలాగే తనపై ఆరోపణలు చేశారన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరుతానన్నారు. లేకుంటే […]

Advertisement
Update: 2019-03-15 03:30 GMT

వైఎస్ వివేకా మృతిపై వైసీపీ వాళ్లు దర్యాప్తుకు డిమాండ్ చేశారని…. తాము కూడా దర్యాప్తు జరిగి నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామన్నారు మంత్రి ఆదినారాయణరెడ్డి. సుధీర్ఘకాలం పాటు తాము, వివేకా కలిసి పనిచేశామన్నారు.

వైఎస్ వివేకా మరణం విషయంలో తనపైనా, చంద్రబాబుపైనా కొందరు ఆరోపణలు చేస్తున్నారని…. కాబట్టి దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. తప్పు చేసి ఉంటే ఉరి తీయాలన్నారు.

జగన్‌పై దాడి సమయంలోనూ ఇలాగే తనపై ఆరోపణలు చేశారన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరుతానన్నారు. లేకుంటే తమపై నిందలేస్తారన్నారు.

ఇంట్లో జరిగిన మరణానికి తాను, చంద్రబాబు ఎలా బాధ్యులం అవుతామని ప్రశ్నించారు. టికెట్ల విషయంలో త్వరగా క్లియర్ చేయాలని తాను చంద్రబాబు వద్ద ఉంటే … హత్యలు ఎలా చేస్తామని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చాలా ప్రమాదకరమని ఆదినారాయణరెడ్డి చెప్పారు.

వైఎస్ వివేకా మృతిపై సిట్ ఏర్పాటు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. అడిషినల్ ఎస్పీ లక్ష్మీనారాయణను దర్యాప్తు అధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. ఘటనాస్థలికి ఫోరెన్సిక్ నిపుణులను కూడా రప్పిస్తున్నట్టు చెప్పారు. నిజానిజాలు వెలుగులోకి తెస్తామన్నారు.

Tags:    
Advertisement

Similar News