అదే కల.... అదే సినిమా

దర్శకుడిగా మారాలన్నది తమ డ్రీమ్ అని చాలామంది చెబుతుంటారు. తమ కలను నెరవేర్చుకున్నామని కూడా చెబుతుంటారు. కానీ తనకొచ్చిన ఓ కల వల్ల తను దర్శకుడిగా మారానంటున్నాడు సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్. 118 సినిమాతో దర్శకుడిగా మారిన గుహన్.. అసలు ఈ ప్రాజెక్టు సాకారం అవ్వడం వెనక ఓ కల దాగుందని అంటున్నాడు. “నేనొకసారి ఒక హోటల్లో స్టే చేసినప్పుడు నాకు క్రైమ్ కు సంబంధించిన ఓ కల వచ్చింది. ఆ కల నుంచి బయటపడి కళ్ళు […]

Advertisement
Update: 2019-03-06 20:56 GMT

దర్శకుడిగా మారాలన్నది తమ డ్రీమ్ అని చాలామంది చెబుతుంటారు. తమ కలను నెరవేర్చుకున్నామని కూడా చెబుతుంటారు. కానీ తనకొచ్చిన ఓ కల వల్ల తను దర్శకుడిగా మారానంటున్నాడు సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్. 118 సినిమాతో దర్శకుడిగా మారిన గుహన్.. అసలు ఈ ప్రాజెక్టు సాకారం అవ్వడం వెనక ఓ కల దాగుందని అంటున్నాడు.

“నేనొకసారి ఒక హోటల్లో స్టే చేసినప్పుడు నాకు క్రైమ్ కు సంబంధించిన ఓ కల వచ్చింది. ఆ కల నుంచి బయటపడి కళ్ళు తెరిచి చూశాను. అప్పుడు నాకు చాలా భయమేసింది. తర్వాత ఇది కలే కదా అని సర్దిచెప్పుకున్నాను. కాసేపు రిలాక్సయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజుల తరవాత మళ్ళీ అదే హోటల్, అదే రూమ్.. ఈసారి కూడా గతంలో వచ్చిన కల మళ్లీ వచ్చింది. ఈసారి దానికి కొనసాగింపు కూడా డ్రీమ్ లో కనిపించింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మెలకువ వచ్చాక ఆలోచనలో పడ్డా. దీన్నే మనం స్టోరీగా డెవలప్ చేసుకుంటే బావుంటుంది కదా.. ఇప్పటి వరకు ఇలాంటి ఐడియా నేనెక్కడ చూడలేదు అనుకున్నాను.”

ఇలా 118 సినిమా వెనక కథను బయటపెట్టాడు గుహన్. ఆ కల తన మనసును కదిలించింది కాబట్టే సినిమా అంత బాగా వచ్చిందంటున్న గుహన్, ఇకపై కూడా ఇలా తన మనసుకు హత్తుకునే కథల్ని మాత్రమే తెరకెక్కిస్తానని తెలిపాడు. నెక్ట్స్ సినిమా కోసం మరో కొత్త జానర్ ను సెలక్ట్ చేసుకుంటానని తెలిపిన గుహన్.. ఈసారి కమర్షియల్ అంశాలు ఇంకాస్త ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడతానంటున్నాడు.

Tags:    
Advertisement

Similar News