అందరూ త్రివిక్రమ్‌ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు మంచి మిత్రులనే విషయం మనందరికీ తెలిసిందే. కేవలం సినిమాల వరకు మాత్రమే వీళ్లా స్నేహాన్ని ఉంచుకోకుండా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ కష్టాల్లో కూడా ఒకరికొకరు ఆసరాగా నిలుస్తారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా వీళ్ళిద్దరూ పబ్లిక్‌గా కలవడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్‌లు అన్ని త్రివిక్రమే రాస్తున్నాడనే టాక్ అందరిలో ఉంది. ఆ విషయం పక్కన పెడితే పవన్ […]

Advertisement
Update: 2019-03-05 22:56 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు మంచి మిత్రులనే విషయం మనందరికీ తెలిసిందే. కేవలం సినిమాల వరకు మాత్రమే వీళ్లా స్నేహాన్ని ఉంచుకోకుండా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ కష్టాల్లో కూడా ఒకరికొకరు ఆసరాగా నిలుస్తారు.

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా వీళ్ళిద్దరూ పబ్లిక్‌గా కలవడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్‌లు అన్ని త్రివిక్రమే రాస్తున్నాడనే టాక్ అందరిలో ఉంది. ఆ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ సభలో త్రివిక్రమ్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. త్రివిక్రమ్ ప్రస్తావన తెస్తూ విద్యతో జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం అందించని విద్య వృధా అని చెప్పాడు.

విద్యార్థులు కూడా ఉన్న జ్ఞానంతో సరిపెట్టుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయంలో జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలని.. దీనికి ఉదాహరణ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పవన్ చెప్పాడు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశాడని కానీ డైరెక్టర్‌గా ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉన్నాడని, ప్రతి నిత్యం త్రివిక్రమ్ ఏదో ఒక విషయాన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. విద్యార్థులందరూ త్రివిక్రమ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సభ ముఖంగా చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News