నొచ్చుకున్న ఎమ్మెల్యే ఆర్కే....

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీలో చిచ్చు రాజుకుంది. జగన్‌ మీద ఈగ వాలినా కేసులు వేస్తూ, ప్రజలకు చేరువగా ఉంటూ, రాజన్న క్యాంటీన్ పెట్టి తక్కువ ధరకే ప్రజలకు భోజనం అందిస్తూ, తక్కువ ధరకే ప్రజలకు కూరగాయలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నొచ్చుకున్నారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో ఆయన బాధపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఆళ్లకు జగన్‌ టికెట్ ఇవ్వడం లేదని, ఉడతా శ్రీను అనే వ్యక్తికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి […]

Advertisement
Update: 2019-03-01 23:29 GMT

గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీలో చిచ్చు రాజుకుంది. జగన్‌ మీద ఈగ వాలినా కేసులు వేస్తూ, ప్రజలకు చేరువగా ఉంటూ, రాజన్న క్యాంటీన్ పెట్టి తక్కువ ధరకే ప్రజలకు భోజనం అందిస్తూ, తక్కువ ధరకే ప్రజలకు కూరగాయలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నొచ్చుకున్నారు. పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో ఆయన బాధపడ్డారు.

ఈసారి ఎన్నికల్లో ఆళ్లకు జగన్‌ టికెట్ ఇవ్వడం లేదని, ఉడతా శ్రీను అనే వ్యక్తికి టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు అందుబాటులో లేరు. ఫోన్‌లో కూడా స్పందించడం లేదు.

తనను హేళన చేసేలా ప్రచారం జరుగుతున్నా పార్టీ నాయకత్వం స్పందించకపోవడం, టికెట్‌పై హామీ రాకపోవడంతో ఆర్కే వైరాగ్యంలో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో ఆయన అన్నింటిని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.

ఆళ్లకు టికెట్ రాదు అన్న ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్‌ కోసం సుప్రీం కోర్టు వరకు వెళ్లి కేసులు వేసి పోరాటం చేస్తున్న ఆళ్లకే మొండిచేయి చూపడం ద్వారా ఎలాంటి సంకేతాలను పంపాలనుకుంటున్నారని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి నేతల మాటలను వింటూ ఆర్కేకు అన్యాయం చేయడం సరికాదంటున్నారు.

Tags:    
Advertisement

Similar News