జగన్ గృహప్రవేశానికి ముహూర్తం ఫిక్స్

వైఎస్‌ జగన్ త్వరలోనే తన నివాసాన్ని ఏపీకి మార్చుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటిలోకి ఈనెల 27న జగన్ గృహప్రవేశం చేయనున్నారు. ఇంటికి పక్కనే పార్టీ ఆఫీస్‌ కూడా నిర్మించారు. దాన్ని కూడా జగన్‌ ప్రారంభించనున్నారు. ఈనెల 14నే గృహప్రవేశం చేయాల్సి ఉన్నప్పటికీ తన సోదరి షర్మిల అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. 27న జరిగే గృహప్రవేశానికి పార్టీ కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఆహ్వానించారు. ప్రస్తుతం జగన్ తన కుమార్తెను కలిసేందుకు లండన్‌ […]

Advertisement
Update: 2019-02-24 20:45 GMT

వైఎస్‌ జగన్ త్వరలోనే తన నివాసాన్ని ఏపీకి మార్చుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటిలోకి ఈనెల 27న జగన్ గృహప్రవేశం చేయనున్నారు. ఇంటికి పక్కనే పార్టీ ఆఫీస్‌ కూడా నిర్మించారు. దాన్ని కూడా జగన్‌ ప్రారంభించనున్నారు.

ఈనెల 14నే గృహప్రవేశం చేయాల్సి ఉన్నప్పటికీ తన సోదరి షర్మిల అనారోగ్యం కారణంగా వాయిదా వేశారు. 27న జరిగే గృహప్రవేశానికి పార్టీ కీలక నేతలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను ఆహ్వానించారు. ప్రస్తుతం జగన్ తన కుమార్తెను కలిసేందుకు లండన్‌ వెళ్లారు.

Tags:    
Advertisement

Similar News