ఏపీ భవన్‌లో చిన్న వ్యాపారులతో రాహుల్ లంచ్

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా పలువురితో చర్చలు జరుపుతున్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండే మ్యానిఫెస్టో కోసం చేస్తున్న సంప్రదింపులు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్‌కు రాహుల్ వెళ్లారు. ఏడుగురు చిన్న వ్యాపారులతో కలసి ‘భోజన్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులు ఎదుర్కుంటున్న సమస్యలు, జీఎస్టీ వలన ఏర్పడిన పరిణామాలు తదితర […]

Advertisement
Update: 2019-02-19 04:58 GMT

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా పలువురితో చర్చలు జరుపుతున్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండే మ్యానిఫెస్టో కోసం చేస్తున్న సంప్రదింపులు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.

ఇవాళ ఢిల్లీలోని ఏపీ భవన్‌కు రాహుల్ వెళ్లారు. ఏడుగురు చిన్న వ్యాపారులతో కలసి ‘భోజన్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. వ్యాపారులు ఎదుర్కుంటున్న సమస్యలు, జీఎస్టీ వలన ఏర్పడిన పరిణామాలు తదితర విషయాలు చర్చించారు.

ఆయన ఏపీ భవన్ కు వచ్చినప్పుడు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని అంతటినీ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం చిత్రీకరణ జరిపింది.

Tags:    
Advertisement

Similar News