అట్టర్‌ప్లాప్‌పై రాంచరణ్‌ బహిరంగ లేఖ

బోయపాటి శీను డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన వినయ విధేయ రామ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో రాంచరణ్‌ ఒక లేఖను విడుదల చేశారు. సినిమా అంచనాలకు అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు. అందరూ మెచ్చే చిత్రాన్ని అందించలేకపోయామని అంగీకరించారు. ”ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు, నా పట్ల, మా సినిమాల పట్ల మీరు చూపిస్తున్నప్రేమాభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ […]

Advertisement
Update: 2019-02-05 20:32 GMT

బోయపాటి శీను డైరెక్షన్‌లో ఇటీవల వచ్చిన వినయ విధేయ రామ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. డీవీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో చిత్ర హీరో రాంచరణ్‌ ఒక లేఖను విడుదల చేశారు. సినిమా అంచనాలకు అందుకోలేకపోయిందని అభిప్రాయపడ్డారు.

అందరూ మెచ్చే చిత్రాన్ని అందించలేకపోయామని అంగీకరించారు. ”ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు, నా పట్ల, మా సినిమాల పట్ల మీరు చూపిస్తున్నప్రేమాభిమానాలకు వినమ్రపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్యగారు అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకి కృతజ్ఞుడనై ఉంటాను. మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం.

దురదృష్టవశాత్తు అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఈ సినిమాని అందించలేకపోయాం. మీ అంచనాలని అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను. అన్ని వేళలా తమ మద్దతు నాకు అందించిన మీడియా మిత్రులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు.” అంటూ రాంచరణ్‌ లేఖను విడుదల చేశారు.

Posted by Ram Charan on Monday, 4 February 2019

Tags:    
Advertisement

Similar News