హరీష్ శంకర్ కి మరో హీరో కూడా దొరికేసాడు

హరీష్ శంకర్ దాదాపు రెండేళ్ళ తరువాత చేస్తున్న సినిమా “వాల్మీకి”. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా అయిన “జిగార్తండ” కి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. తమిళ్ లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రని ఇక్కడ తెలుగు లో వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. కానీ తమిళ్ లో సిద్దార్థ్ పోషించిన పాత్రకి మాత్రం ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో […]

Advertisement
Update: 2019-02-01 23:22 GMT

హరీష్ శంకర్ దాదాపు రెండేళ్ళ తరువాత చేస్తున్న సినిమా “వాల్మీకి”. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ సూపర్ హిట్ సినిమా అయిన “జిగార్తండ” కి ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

తమిళ్ లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రని ఇక్కడ తెలుగు లో వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. కానీ తమిళ్ లో సిద్దార్థ్ పోషించిన పాత్రకి మాత్రం ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో కూడా దొరకలేదు.

ఇక చేసేది లేక తమిళ హీరో సిద్దార్థ్ నే మళ్ళీ ఆ రోల్ కే తీసుకుందాం అనుకునే టైం లో హరీష్ శంకర్ ఈ రోల్ కి చిన్న హీరో శ్రీ విష్ణు అయితే పర్ఫెక్ట్ అని భావించాడట. ఈ మేరకు శ్రీ విష్ణు తో మంతనాలు జరుపుతున్నాడట హరీష్ శంకర్.

ఒక గ్యాంగ్ స్టర్ కి, ఒక ఫిలిం మేకర్ కి మధ్య జరిగే కథగా ఈ “వాల్మీకి” తెరకెక్కనుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News