రంజీ ట్రోఫీ చేజింగ్ లో సౌరాష్ట్ర సరికొత్త రికార్డు

యూపీతో క్వార్టర్స్ లో సంచలన విజయం 372 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించిన సౌరాష్ట్ర జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ లో…మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సంచలన విజయం తో సెమీస్ కు చేరుకొంది. చేజింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. లక్నో వేదికగా ఉత్తరప్రదేశ్ తో ముగిసిన సెమీఫైనల్లో… సౌరాష్ట్ర 372 పరుగుల లక్ష్యాన్ని 115.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్ల నష్టానికే సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓపెనర్ హార్విక్ దేశాయ్ ఫైటింగ్ సెంచరీ […]

Advertisement
Update: 2019-01-19 11:18 GMT
  • యూపీతో క్వార్టర్స్ లో సంచలన విజయం
  • 372 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేదించిన సౌరాష్ట్ర

జాతీయ క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే రంజీట్రోఫీ లో…మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సంచలన విజయం తో సెమీస్ కు చేరుకొంది. చేజింగ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

లక్నో వేదికగా ఉత్తరప్రదేశ్ తో ముగిసిన సెమీఫైనల్లో… సౌరాష్ట్ర 372 పరుగుల లక్ష్యాన్ని 115.1 ఓవర్లలోనే కేవలం 4 వికెట్ల నష్టానికే సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఓపెనర్ హార్విక్ దేశాయ్ ఫైటింగ్ సెంచరీ సాధించగా… స్నెల్ పటేల్ 72 పరుగులకు అవుట్ కాగా… చతేశ్వర్ పూజారా 67, షెల్డన్ జాక్సన్ 73 పరుగుల నాటౌట్ స్కోర్లతో తమ జట్టు విజయాన్ని ఖాయం చేశారు.

2008-09 సీజన్లో సర్వీసెస్ పై అసోం సాధించిన 371 పరుగుల రికార్డే ఇప్పటి వరకూ అత్యధిక చేజింగ్ లక్ష్యంగా ఉంది.

ఈ రికార్డును సౌరాష్ట్ర తిరగరాసింది. సెమీఫైనల్లో కర్నాటకతో సౌరాష్ట్ర, విదర్భతో కేరళ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

Tags:    
Advertisement

Similar News