జగన్‌తో కేటీఆర్‌ భేటీ

ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌లతో చర్చలు జరిపిన కేసీఆర్‌… ఇప్పుడు తోటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీతో చర్చలకు కేసీఆర్‌ బృందాన్ని పంపుతున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం నేడు వైఎస్ జగన్ వద్దకు వెళ్లనుంది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కేటీఆర్‌ కలిసి ఫెడరల్ […]

Advertisement
Update: 2019-01-15 20:05 GMT

ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌లతో చర్చలు జరిపిన కేసీఆర్‌… ఇప్పుడు తోటి తెలుగు రాష్ట్రం ఏపీలోనూ మద్దతు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీతో చర్చలకు కేసీఆర్‌ బృందాన్ని పంపుతున్నారు.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం నేడు వైఎస్ జగన్ వద్దకు వెళ్లనుంది. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌ను కేటీఆర్‌ కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరపనున్నారు.

కేటీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు వినోద్, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి జగన్‌ వద్దకు వెళ్లనున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్‌ను కోరనున్నారు.

Tags:    
Advertisement

Similar News