జమ్మలమడుగు అభ్యర్థిని ప్రకటించిన జగన్

మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్. కడప జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గానికి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‌ రెడ్డిని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి సుధీర్‌ రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉంటూ వస్తున్నారు. ఆదివారం జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన నేతలు పులివెందులలో జగన్‌ను కలిశారు. సుధీర్‌ రెడ్డితో జగన్ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన జగన్‌…. సుధీర్‌ […]

Advertisement
Update: 2019-01-13 18:19 GMT

మరో నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించారు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్. కడప జిల్లాలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గానికి అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‌ రెడ్డిని జగన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు.

అప్పటి నుంచి సుధీర్‌ రెడ్డి ఇన్‌చార్జ్‌గా ఉంటూ వస్తున్నారు. ఆదివారం జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన నేతలు పులివెందులలో జగన్‌ను కలిశారు. సుధీర్‌ రెడ్డితో జగన్ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన జగన్‌…. సుధీర్‌ రెడ్డిని జమ్మలమడుగు అభ్యర్థిగా నేతల సమక్షంలో ప్రకటించారు.

సుధీర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు అయితే జమ్మలమడుగు టికెట్ ఆశిస్తూ వచ్చిన అల్లె ప్రభావతి అలకబూనారు. కార్యకర్తలతో కలిసి జగన్ ఇంటి ఎదుటే బైఠాయించారు. స్వయంగా జగన్‌ వచ్చి ఆమెకు సర్దిచెప్పారు. దాంతో మెత్తబడ్డ ప్రభావతి ఆందోళన విరమించారు.

Tags:    
Advertisement

Similar News