కశ్మీర్ సివిల్ కేడర్ ఐఏఎస్ షా ఫైజల్ సంచలన నిర్ణయం...!

సివిల్ సర్వీసెస్ లో టాప్ ర్యాంక్ సాధించి…. మొదటి కశ్మీరీగా రికార్డుల్లో కెక్కిన 35ఏళ్ల షా ఫైజల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించి.. దేశవ్యాప్తంగా ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన అధికారి అయిన ఫైజ‌ల్ ను సరిహద్దు రాష్ట్రం కశ్మీర్‌లో జరుగుతున్న మారణకాండ, హింసాత్మక వాతావరణం తీవ్రంగా కలిచివేసింది. కశ్మీర్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్ర […]

Advertisement
Update: 2019-01-09 20:38 GMT

సివిల్ సర్వీసెస్ లో టాప్ ర్యాంక్ సాధించి…. మొదటి కశ్మీరీగా రికార్డుల్లో కెక్కిన 35ఏళ్ల షా ఫైజల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ లో విజయం సాధించి.. దేశవ్యాప్తంగా ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలిచారు.

2010 బ్యాచ్ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన అధికారి అయిన ఫైజ‌ల్ ను సరిహద్దు రాష్ట్రం కశ్మీర్‌లో జరుగుతున్న మారణకాండ, హింసాత్మక వాతావరణం తీవ్రంగా కలిచివేసింది. కశ్మీర్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపేలా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో…. కశ్మీర్ సమస్యలను లేవనెత్తుతూ కేంద్రంతో పోరాడేందుకు షా ఫైజల్ సిద్దమయ్యారు. తాను ఎన్నో ఏళ్లుగా కలలు కని కష్టపడి సాధించిన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజరాత్‌లో గత ఏడాది 46 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై ఐఏఎస్ షా ఫైజల్ ట్వీట్ చేయడంతో చిక్కుల్లో పడ్డారు. పితృస్వామ్యం, జనాభా, నిరక్షరాస్యత, ఆల్కాహాల్, పోర్న్, టెక్నాలజీ, అరాచకం…. ఇవన్నీ కలిసి రేపిస్తాన్ అంటూ షా ఫైజల్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం షా ఫైజల్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అదే స‌మ‌యంలో క‌శ్మీర్‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోవ‌డంతో…ఆయ‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు.

కశ్మీరీల సమస్యలపై పోరాడేందుకు నేను ఐఏఎస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని షా ఫైజల్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. షా ఫైజల్ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానన్నారు.

తాను నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరాలనుకుంటున్నానని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని షా ఫైజల్ తెలిపారు. కాగా ఐఏఎస్ షా ఫైజల్ తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు.

Tags:    
Advertisement

Similar News