ఆ కులాలంటే అంత లెక్కలేదా? ఎంత అహంకారం?

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పై… మెగాబ్రదర్ నాగబాబు దండయాత్ర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. గతంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బాలకృష్ణ ఐదో కామెంట్ కు కౌంటర్‌ ఇచ్చారు నాగబాబు. సంకరజాతి పార్టీలు అలగా జనాన్ని వేసుకుని వస్తున్నాయంటూ ఇటీవల బాలకృష్ణ ఒక మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలను నాగబాబు గుర్తు చేశారు. అలగా జనాన్ని వెంటేసుకుని వస్తున్న పార్టీ అంటూ బాలకృష్ణ జనసేననే […]

Advertisement
Update: 2019-01-08 01:28 GMT

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పై… మెగాబ్రదర్ నాగబాబు దండయాత్ర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు.

గతంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై నాగబాబు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా బాలకృష్ణ ఐదో కామెంట్ కు కౌంటర్‌ ఇచ్చారు నాగబాబు. సంకరజాతి పార్టీలు అలగా జనాన్ని వేసుకుని వస్తున్నాయంటూ ఇటీవల బాలకృష్ణ ఒక మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలను నాగబాబు గుర్తు చేశారు.

అలగా జనాన్ని వెంటేసుకుని వస్తున్న పార్టీ అంటూ బాలకృష్ణ జనసేననే విమర్శించారన్నది తన ఉద్దేశమన్నారు నాగబాబు. జనసేనలో కాపులు, దళితులు, రెడ్లు, కమ్మలు, బ్రాహ్మణులు అందరూ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు.

ఇవే కులాల వారు టీడీపీ, వైసీపీలో కూడా పనిచేస్తున్నారన్నారు. అంటే ఈ కులాల వారంతా బాలకృష్ణ దృష్టిలో సంకరజాతి వారా అని నాగబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారని ఈ వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందని విమర్శించారు. త్వరలోనే బాలకృష్ణ చేసిన ఆరో కామెంట్‌కు కూడా తాను సమాధానం చెబుతానని నాగబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఈ వివాదానికి ముగింపు పలుకుతానన్నారు.

Comment No 5: సామెత : " తండ్రి మాతా చార్యుడు , తనయుడు ఆచార్యుడు , తల్లి రామానుజ మతస్థురాలు ……… అల్లుడు పింజారి…

Publiée par Naga Babu sur Lundi 7 janvier 2019

Tags:    
Advertisement

Similar News