బుద్దా వెంకన్నకు షాక్‌.... సోదరుడు జంప్‌

వైసీపీపై ఒంటికాలితో లేచే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్‌ తగిలింది. ఆయన సొంత సోదరుడే టీడీపీని వీడారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో బుద్దా నాగేశ్వరరావు మంగళవారం వైసీపీలో చేరారు. శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తన సోదరుడు బుద్దా వెంకన్న స్వార్థంతో పనిచేస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. బుద్దా వెంకన్న వల్ల బీసీలకు ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. […]

Advertisement
Update: 2019-01-08 06:38 GMT

వైసీపీపై ఒంటికాలితో లేచే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు షాక్‌ తగిలింది. ఆయన సొంత సోదరుడే టీడీపీని వీడారు. వైఎస్‌ జగన్‌ సమక్షంలో బుద్దా నాగేశ్వరరావు మంగళవారం వైసీపీలో చేరారు. శ్రీకాకుళంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ను అనుచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు.

తన సోదరుడు బుద్దా వెంకన్న స్వార్థంతో పనిచేస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. బుద్దా వెంకన్న వల్ల బీసీలకు ఎలాంటి ఉపయోగం జరగలేదన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. చాలా మంది బీసీ టీడీపీ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బుద్దా నాగేశ్వరరావు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News