అలా చేయడం అమ్మను మార్చుకోవడమే " బండ్ల గణేష్

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం అంటే అమ్మను మార్చడమేనని వ్యాఖ్యానించారు. పార్టీ మారడం అంటే ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టి… మరొకరిని తల్లిదండ్రులుగా చెప్పుకుని తిరగడం లాంటిదేనన్నారు. ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ఎవరైనా సరే సదరు పార్టీకి రాజీనామా చేయడంతోపాటు… ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి జనం వద్దకు వెళ్లి ప్రజా […]

Advertisement
Update: 2018-12-24 00:55 GMT

తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సినీ నిర్మాత బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం అంటే అమ్మను మార్చడమేనని వ్యాఖ్యానించారు. పార్టీ మారడం అంటే ఒక తల్లికి, ఒక తండ్రికి పుట్టి… మరొకరిని తల్లిదండ్రులుగా చెప్పుకుని తిరగడం లాంటిదేనన్నారు.

ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే ఎవరైనా సరే సదరు పార్టీకి రాజీనామా చేయడంతోపాటు… ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి జనం వద్దకు వెళ్లి ప్రజా తీర్పు తీసుకోవాలన్నారు. ఒక గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లిపోవడం అంటే తల్లిని అమ్ముకుని బతకడమేనన్నారు. అలాంటి పని తాను ఎన్నడూ చేయబోనన్నారు.

పార్టీ ఫిరాయించే వారిని చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీని కొందరు వృద్ధులే ముంచుతున్నారన్నారు. వృద్ధులు రాజ్యసభకు, శాసనమండలికి వెళ్లి యువతను ముందు పెట్టాలని బండ్ల గణేష్ సూచించారు.

Tags:    
Advertisement

Similar News