చంద్రబాబు మళ్లీ మావద్దకే రావొచ్చు.... వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదు....

బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్‌ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. వైసీపీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ ప్రసక్తే లేదన్నారు. టీడీపీతో మాత్రం తనకు శాశ్వత శత్రుత్వం ఏమీ లేదన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. టీడీపీ ప్రస్తుతానికి తమతో తెగదెంపులు చేసుకున్నా… తిరిగి 2019 తర్వాత తమ వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. ”టీడీపీ […]

Advertisement
Update: 2018-12-23 00:35 GMT

బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇండియా టుడే మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాంమాధవ్‌ పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు.

వైసీపీతో పొత్తు ఉంటుందా? అన్న ప్రశ్నకు ఆ ప్రసక్తే లేదన్నారు. టీడీపీతో మాత్రం తనకు శాశ్వత శత్రుత్వం ఏమీ లేదన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు.

టీడీపీ ప్రస్తుతానికి తమతో తెగదెంపులు చేసుకున్నా… తిరిగి 2019 తర్వాత తమ వద్దకు వచ్చే అవకాశం ఉందన్నారు. ”టీడీపీ తిరిగి మా వద్దకే వస్తుందేమో … ఎవరికి తెలుసు?” అని ప్రశ్నించారు.

కూటమిల పేరుతో చంద్రబాబు, కేసీఆర్‌ దేశంలో పర్యటనలు చేసినా బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. 2019లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉండడం వల్లే బీజేపీ ఒక్క స్థానానికి పరిమితమైందన్నారు రాంమాధవ్.

Tags:    
Advertisement

Similar News