రజనీకాంత్ సరసన కీర్తిసురేష్

రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత సినిమాల విషయంలో ఇంకా స్పీడ్ పెంచాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం రాజకీయాలు తక్కువగా మాట్లాడుతూ, సినిమాల గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు సూపర్ స్టార్. ప్రస్తుతం పెట్టా సినిమాను పూర్తిచేసిన రజనీకాంత్, త్వరలోనే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. కాస్త సందేశాత్మకంగా సినిమాలు చేయడం మురుగదాస్ స్పెషల్. అలా రాసుకున్న […]

Advertisement
Update: 2018-12-19 10:33 GMT

రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత సినిమాల విషయంలో ఇంకా స్పీడ్ పెంచాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ప్రస్తుతం రాజకీయాలు తక్కువగా మాట్లాడుతూ, సినిమాల గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఈ క్రమంలో మరో సినిమా ఎనౌన్స్ చేశాడు సూపర్ స్టార్.

ప్రస్తుతం పెట్టా సినిమాను పూర్తిచేసిన రజనీకాంత్, త్వరలోనే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. కాస్త సందేశాత్మకంగా సినిమాలు చేయడం మురుగదాస్ స్పెషల్. అలా రాసుకున్న ఓ కథ రజనీకాంత్ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు.

ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకున్నారు. రీసెంట్ గా మురగదాస్ డైరక్ట్ చేసిన సర్కార్ సినిమాలో కూడా కీర్తిసురేష్ నటించింది. కానీ అందులో ఆమెకు అస్సలు ప్రాధాన్యం దక్కలేదు. ఈసారి కాస్త కేర్ తీసుకొని రజనీకాంత్ సినిమాలో కీర్తిసురేష్ కు మంచి సన్నివేశాలు రాశాడట మురుగదాస్.

Tags:    
Advertisement

Similar News