కాస్టింగ్ కౌచ్ పై ఇలా స్పందించింది....

ఇటీవలే తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ, మళయాళ, హిందీ ఇండస్ట్రీ ల్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది హీరోయిన్స్ మీటూ ఉద్యమంలో పాల్గొని తమకు జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పారు. కానీ తమన్నా మాత్రం ఇండస్ట్రీ లో అసలు కాస్టింగ్ కౌచ్ ఉండే ప్రసక్తే లేదు అని చెబుతోంది. అసలు ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని, హీరోయిన్లను ఎవ్వరూ ఇబ్బంది పెట్టే ప్రసక్తే […]

Advertisement
Update: 2018-12-16 23:53 GMT

ఇటీవలే తెలుగు ఇండస్ట్రీ తో పాటు తమిళ, మళయాళ, హిందీ ఇండస్ట్రీ ల్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే నడిచింది. చాలా మంది హీరోయిన్స్ మీటూ ఉద్యమంలో పాల్గొని తమకు జరిగిన అన్యాయం గురించి బయటకు చెప్పారు. కానీ తమన్నా మాత్రం ఇండస్ట్రీ లో అసలు కాస్టింగ్ కౌచ్ ఉండే ప్రసక్తే లేదు అని చెబుతోంది.

అసలు ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదని, హీరోయిన్లను ఎవ్వరూ ఇబ్బంది పెట్టే ప్రసక్తే లేదని తమన్నా అంటోంది. కోట్లరూపాయల ఖర్చుతో నిర్మాతలు సినిమాలను రూపొందిస్తున్నారని…. అలాంటి ఇండస్ట్రీ లో హీరోయిన్లను వేధించేందుకు ఎవరికీ తీరిక ఉండదన్నట్టుగా తమన్నా చెప్పుకొచ్చింది.

అలాగే ఇప్పుడు బయటకి వచ్చి చెప్పే వారు ఏదో ఫేం కోసం చెప్తున్నారే కానీ అవన్నీ నిజాలా… కాదా… అని మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు అనేది తమన్నా వాదన.

అయితే ఇప్పటికీ పలు ఇండస్ట్రీస్ నుంచి కొంత మంది హీరోయిన్స్ మేమూ బాధితులమేనంటూ బయటకు వస్తున్నారు. మరి ఆ హీరోయిన్స్… తమన్నా చేసిన ఈ కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News