ఈసారి కూడా ఆమెదే డామినేషన్

ఓ సినిమాలో సాయిపల్లవి ఉందంటే ఆమె డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. తెరపై ఈ ముద్దుగుమ్మ కనిపిస్తే హీరో కనపడడు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, నటన, స్మైల్ కుర్రాళ్లను కట్టిపడేస్తాయి. మరోసారి ఈ మద్దుగుమ్మ తన ఆధిపత్యం చూపించింది. ప్రస్తుతం శర్వానంద్ సరసన ”పడిపడి లేచే మనసు” అనే సినిమా చేస్తోంది సాయిపల్లవి. ఈ సినిమాకు సంబంధించి తొలి సింగిల్ ను ఈరోజు విడుదల చేశారు. ఆ పాటలో శర్వానంద్, సాయిపల్లవి ఇద్దరూ ఉన్నారు. కానీ కళ్లకు […]

Advertisement
Update: 2018-11-23 06:38 GMT

ఓ సినిమాలో సాయిపల్లవి ఉందంటే ఆమె డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. తెరపై ఈ ముద్దుగుమ్మ కనిపిస్తే హీరో కనపడడు. ఆమె ఎక్స్ ప్రెషన్స్, నటన, స్మైల్ కుర్రాళ్లను కట్టిపడేస్తాయి. మరోసారి ఈ మద్దుగుమ్మ తన ఆధిపత్యం చూపించింది.

ప్రస్తుతం శర్వానంద్ సరసన ”పడిపడి లేచే మనసు” అనే సినిమా చేస్తోంది సాయిపల్లవి. ఈ సినిమాకు సంబంధించి తొలి సింగిల్ ను ఈరోజు విడుదల చేశారు. ఆ పాటలో శర్వానంద్, సాయిపల్లవి ఇద్దరూ ఉన్నారు. కానీ కళ్లకు మాత్రం సాయిపల్లవి మాత్రమే కనిపిస్తుంది. అంతలా ఎట్రాక్ట్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఫిదాలో వరుణ్ తేజ్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది సాయిపల్లవి. ఇక ఎంసీఏ సినిమాలో నేచురల్ స్టార్ నాని ని పక్కకు నెట్టేసింది. ఇలాంటి అమ్మాయి సరసన నటించాలంటే ఇకపై హీరోలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలేమో. దానికి తాజాగా విడుదలైన ”పడిపడి లేచే మనసు” పాటే ఉదాహరణ.

Tags:    
Advertisement

Similar News