"సై రా" సినిమా అంటే నయనతారకి లెక్క లేదా ? 

మెగా స్టార్ చిరంజీవి హీరో గా రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. అయితే ఆమెకున్న బిజీ షెడ్యూల్ కారణంగా “సైరా” సినిమాకి నయన్ ఇచ్చిన డేట్స్ చాలా తక్కువట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చిందని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే ఆమెకు సంబంధించిన సీన్స్‌ను తెరకెక్కించేందుకు సురేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అసలు ఇప్పటి […]

Advertisement
Update: 2018-11-15 23:17 GMT

మెగా స్టార్ చిరంజీవి హీరో గా రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న సినిమా “సై రా నరసింహారెడ్డి”. ఈ సినిమాలో నయనతార ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. అయితే ఆమెకున్న బిజీ షెడ్యూల్ కారణంగా “సైరా” సినిమాకి నయన్ ఇచ్చిన డేట్స్ చాలా తక్కువట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కోసం మూడు రోజుల కాల్ షీట్ ఇచ్చిందని సమాచారం. ఈ మూడు రోజుల్లోనే ఆమెకు సంబంధించిన సీన్స్‌ను తెరకెక్కించేందుకు సురేందర్‌రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అసలు ఇప్పటి వరకు నయనతార కి సంభందించిన షూటింగ్ పార్ట్ చాలా తక్కువ చేసారు. దీనికి కారణం ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటమే అని తెలుస్తుంది.

అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని నయనతార ఎందుకు లైట్ తీసుకుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. కనీసం తదుపరి షెడ్యూల్స్ లో అయిన నయన పూర్తీ స్థాయి డేట్స్ కే టాయిస్తుందో లేదో చూడాలి. ఇటివలే జార్జియా లో ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ని పూర్తీ చేసుకొని వచ్చారు మూవీ యూనిట్. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News