ఈటెలపై కారు డ్రైవర్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ తాజా మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ మాజీ కారు డ్రైవర్ మేకల మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణపై దాడి చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన మల్లేష్… ఇప్పుడు ఈటెలపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఈటెల తనను మోసం చేశారని మీడియా […]

Advertisement
Update: 2018-11-09 22:48 GMT

తెలంగాణ తాజా మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ మాజీ కారు డ్రైవర్ మేకల మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణపై దాడి చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన మల్లేష్… ఇప్పుడు ఈటెలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఈటెల తనను మోసం చేశారని మీడియా ముందు వాపోయారు మల్లేష్.

అసెంబ్లీ ఆవరణలో జరిగిన దాడి వల్ల తాను 45 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందన్నారు. ఉద్యోగం కూడా పోయిందన్నారు. ఆసమయంలో పలువురు దాతలు తనకు 30 లక్షల విరాళం ఇచ్చారని చెప్పారు. కానీ ఆ 30లక్షలను ఈటెల రాజేందరే తీసుకున్నారని ఆరోపించారు. దాంతో ఉద్యోగం పోయి, వచ్చిన డబ్బు పోయి తాను ఇబ్బందులు పడ్డానని చెప్పారు.

కుటుంబాన్ని పోషించేందుకు కూలి పని చేసుకుంటున్నానని చెప్పారు. ఇంత జరిగినా ఈటెల రాజేందర్ డబ్బు ఇవ్వడం గానీ, ఆదుకోవడం గానీ చేయలేదని చెప్పారు. తనకు ఈటెల నుంచి ప్రాణ హాని ఉందని…. రక్షణ కల్పించాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News