ఆర్ కృష్ణయ్య ఏ పార్టీలో ఉన్నట్టు?

బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత ఆర్ కృష్ణయ్య. గత ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థి. 2014 ఎన్నికల తరువాత టీడీపీకి క్రమేణా దూరంగా జరిగిన ఆయన ఆ పార్టీలో లేనని చెప్పారు. ఇప్పుడు ఏపార్టీకి దగ్గరగా లేరు కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన… పోటీ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. విభజన జరిగాక 2014 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేతను చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, ఆర్ కృష్ణయ్యను […]

Advertisement
Update: 2018-11-01 11:40 GMT

బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత ఆర్ కృష్ణయ్య. గత ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థి. 2014 ఎన్నికల తరువాత టీడీపీకి క్రమేణా దూరంగా జరిగిన ఆయన ఆ పార్టీలో లేనని చెప్పారు. ఇప్పుడు ఏపార్టీకి దగ్గరగా లేరు కూడా. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయన… పోటీ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.

విభజన జరిగాక 2014 ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ సీఎం అభ్యర్థిగా బీసీ నేతను చేస్తానని ప్రకటించిన చంద్రబాబు, ఆర్ కృష్ణయ్యను ప్రకటించారు. కానీ, టీడీపీ అంతలా పుంజుకోలేదు. ఆయన సీఎం కాలేదు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కృష్ణయ్య టీడీపీకి బై బై చెప్పేశారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు ఊపందుకున్న వేళ ఆయనను సీపీఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది.

సీపీఎం బీఎల్ఎఫ్ తరుపున సీఎం అభ్యర్థిగా కృష్ణయ్యను ప్రకటించారు. కృష్ణయ్య మాత్రం ఏ అభిప్రాయమూ వ్యక్తం చేయలేదు. ఒకానొక దశలో మంద కృష్ణ మాదిగ, కాసాని జ్ఞానేశ్వర్ తో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రణాళిక కూడా రచించారట. సొంత పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అవి ఏమి వర్కవుట్ అవలేదు. దాంతో ఆయన పొలిటికల్ భవిష్యత్తు ఏదో ఒక పార్టీతో నిర్ణయించుకోక తప్పడం లేదు.

ప్రస్తుతం ఆయన చూపు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన గత ఎన్నికల్లో ఎల్ బీ నగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తాజా మాజీ ఎమ్మెల్యే హోదాలో కాంగ్రెస్ తరుపున బరిలో దిగాలన్నా కుదిరేలా లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున సుధీర్ రెడ్డి అక్కడ ప్రచారం మొదలు పెట్టేశారు.

ఈ నేపథ్యంలో కృష్ణయ్య ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. దాదాపు ఆయన కాంగ్రెస్ తోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కృష్ణయ్య టీడీపీలోనే ఉన్నట్లు చెబుతున్నారట. ఈ క్రమంలో అయనకు ఏపార్టీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుంది? అసలు పోటీచేస్తారా? లేదా? అన్నది తెలియడం లేదు.

Tags:    
Advertisement

Similar News