ఆసియాకప్ చాంపియన్స్ ట్రోఫీ హాకీలో అతిపెద్ద సమరం

భారత్ తో పాకిస్థాన్ అమీతుమీ 175వసారి తలపడుతున్న భారత్, పాక్ జట్లు 174 మ్యాచ్ ల్లో భారత్ 61, పాకిస్థాన్ 82 విజయాలు ఒమన్ వేదికగా జరుగుతున్న 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ రౌండ్ రాబిన్ లీగ్ లో… అతిపెద్ద సమరానికి మస్కట్ లో రంగం సిద్ధమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటి వరకూ ఈ రెండుజట్ల మధ్య జరిగిన 174 మ్యాచ్ ల్లో పాకిస్థాన్ 82, భారత్ 61 […]

Advertisement
Update: 2018-10-20 04:15 GMT
  • భారత్ తో పాకిస్థాన్ అమీతుమీ
  • 175వసారి తలపడుతున్న భారత్, పాక్ జట్లు
  • 174 మ్యాచ్ ల్లో భారత్ 61, పాకిస్థాన్ 82 విజయాలు

ఒమన్ వేదికగా జరుగుతున్న 2018 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ రౌండ్ రాబిన్ లీగ్ లో… అతిపెద్ద సమరానికి మస్కట్ లో రంగం సిద్ధమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.
ఇప్పటి వరకూ ఈ రెండుజట్ల మధ్య జరిగిన 174 మ్యాచ్ ల్లో పాకిస్థాన్ 82, భారత్ 61 విజయాల రికార్డుతో ఉన్నాయి. మరో 31 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

2010 తర్వాత భారత్, పాక్ జట్లు.. మొత్తం 50 మ్యాచ్ ల్లో ఢీ కొంటే… భారత జట్టు 34 విజయాలు, 8 పరాజయాలు రికార్డుతో ఉంది.
మరో 8 మ్యాచ్ లు డ్రాల పద్దులో చేరాయి. ప్రస్తుత చాంపియన్ భారత్, మాజీ చాంపియన్ పాకిస్థాన్.. అంతర్జాతీయ హాకీలో ఢీ కొనబోవడం ఇది 175వసారి కావడం విశేషం.
ఈ పోటీలో ప్రపంచ ఐదవ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

Tags:    
Advertisement

Similar News