ఇదీ.... ఏపీలో పోలీసు వ్యవస్థ పనితీరు....

మనిషి అన్నాక ఒక యాక్టర్‌పైనో, నాయకుడిపైనో అభిమానం ఉండడం సహజం. దాన్ని పలువురు పలు రకాల్లో వ్యక్తపరుస్తుంటారు. తప్పులేదు. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు.. అందరినీ సమదృష్టితో చూడాల్సిన వారు, అందునా నిబంధనలు పాటించి సామాన్యులకు అదర్శంగా ఉండవలసిన వారే అలా ఉండకపోతే వ్యవస్థ గాడితప్పడం ఖాయం. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారే దారి తప్పితే వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది పెడదోవ పట్టడం ఖాయం. అలాంటి వ్యవహారానికి సంబంధించినదే ఈ ఫొటో. ఒక […]

Advertisement
Update: 2018-10-17 01:17 GMT

మనిషి అన్నాక ఒక యాక్టర్‌పైనో, నాయకుడిపైనో అభిమానం ఉండడం సహజం. దాన్ని పలువురు పలు రకాల్లో వ్యక్తపరుస్తుంటారు. తప్పులేదు. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు.. అందరినీ సమదృష్టితో చూడాల్సిన వారు, అందునా నిబంధనలు పాటించి సామాన్యులకు అదర్శంగా ఉండవలసిన వారే అలా ఉండకపోతే వ్యవస్థ గాడితప్పడం ఖాయం. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్న వారే దారి తప్పితే వారిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది పెడదోవ పట్టడం ఖాయం.

అలాంటి వ్యవహారానికి సంబంధించినదే ఈ ఫొటో. ఒక ప్రముఖ ఆంగ్లదిన పత్రిక ఈ ఫొటోను ప్రచురించగా..సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయవాడలో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఇలా తన బైక్‌పై పవన్ కల్యాణ్ బొమ్మ అచ్చేసుకుని తిరుగుతున్నారు. పీకే… లీడర్‌ అని నెంబర్‌ ప్లేట్‌ స్థానంలో రాసుకుని తిరుగుతున్నారు.

ఎస్‌ఐ అయి ఉండి తాను ఇలా చేస్తే జనం ఏమనుకుంటారు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్న భయం కూడా లేకుండా ఎస్‌ఐ గారు ఇలా పవన్‌ భక్తుడిగా మారి పనిచేస్తున్నారు. నిజానికి నెంబర్‌ ప్లేట్ స్థానంలో నెంబర్‌ ప్లేట్ మాత్రమే ఉండాలి. కానీ తాను ఖాకీని కాబట్టి నెంబర్‌ ప్లేట్ అక్కర్లేదనుకున్నారో ఏమో గానీ నెంబర్‌ ప్లేట్‌ పీకేసి పవన్‌ కల్యాణ్‌ బొమ్మేసుకున్నారు.

ఎస్‌ఐ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలా చేయడం సరికాదంటున్నారు. అసలు ఇంత దర్జాగా ఎస్‌ఐ ఇలా తిరుగుతుంటే ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Similar News