రామ్ కు పోటీగా నిలిచిన విశాల్

రామ్ సోలోగా వస్తాడని మొన్నటివరకు అనుకున్నారు. ఆ మేరకు నిర్మాత దిల్ రాజు తెరవెనక ఏర్పాట్లన్నీ పూర్తిచేసి ఉంటాడని భావించారు. ఈ నేపథ్యంలో విశాల్ రేసు నుంచి తప్పుకున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ విశాల్ రేసులో ఉన్నాడు. తను కూడా దసరాకి, రామ్ కు పోటీగా వస్తున్నట్టు మరోసారి ప్రకటించాడు. విశాల్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ విశాల్‌ కెరీర్‌లోనే […]

Advertisement
Update: 2018-10-12 22:15 GMT

రామ్ సోలోగా వస్తాడని మొన్నటివరకు అనుకున్నారు. ఆ మేరకు నిర్మాత దిల్ రాజు తెరవెనక ఏర్పాట్లన్నీ పూర్తిచేసి ఉంటాడని భావించారు. ఈ నేపథ్యంలో విశాల్ రేసు నుంచి తప్పుకున్నాడని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ విశాల్ రేసులో ఉన్నాడు. తను కూడా దసరాకి, రామ్ కు పోటీగా వస్తున్నట్టు మరోసారి ప్రకటించాడు.

విశాల్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఇది విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. పైగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది.

అందుకే పోటీ నుంచి తప్పుకోవడానికి ఇష్టపడలేదు విశాల్. రామ్ నటించిన ”హలో గురు ప్రేమకోసమే” సినిమాకు పోటీగా పందెంకోడి-2ను రంగంలోకి దించుతున్నాడు. అంతేకాదు, తెలుగులో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మరో 2 రోజుల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News