గోశాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్

తెలుగులో బిగ్ బి చేస్తున్న సినిమా సైరా. సొంత బ్యానర్ పై చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ టీజర్ ను విడుదల చేశారు. బిగ్ బి పుట్టినరోజు సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ, సైరాలో అతడి పాత్ర వివరాల్ని బయటపెట్టారు. సైరా నరసింహారెడ్డిలో గోశాయి వెంకన్న పాత్రలో కనిపించబోతున్నారు అమితాబ్. నరసింహారెడ్డిని ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దడంలో గోశాయి వెంకన్న పాత్ర చిరస్థాయిగా […]

Advertisement
Update: 2018-10-11 20:21 GMT

తెలుగులో బిగ్ బి చేస్తున్న సినిమా సైరా. సొంత బ్యానర్ పై చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ టీజర్ ను విడుదల చేశారు. బిగ్ బి పుట్టినరోజు సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ, సైరాలో అతడి పాత్ర వివరాల్ని బయటపెట్టారు.

సైరా నరసింహారెడ్డిలో గోశాయి వెంకన్న పాత్రలో కనిపించబోతున్నారు అమితాబ్. నరసింహారెడ్డిని ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్దడంలో గోశాయి వెంకన్న పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్ర కాబట్టే, ఇందులో నటించేందుకు అమితాబ్ వెంటనే ఒప్పుకున్నారు.

నిజానికి అమితాబ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చేసింది. ఆమధ్య జరిగిన సైరా లీకుల్లో భాగంగా బిగ్ బి స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అవే స్టిల్స్ ను మళ్లీ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది సైరా.

Tags:    
Advertisement

Similar News