నవాబ్ సినిమాని చరణ్ అందుకే రిజెక్ట్ చేసాడట

సీనియర్ డైరెక్టర్ మణిరత్నం నుంచి ఎన్ని బ్లాక్ బస్టర్స్… ఎన్ని క్లాసిక్స్ వచ్చాయి అనేది ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. అయితే గత కొంతకాలంగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి. దాంతో ఈ డైరెక్టర్ సినిమాలో నటించడానికి కొంతమంది స్టార్స్ భయపడేవారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. “నవాబ్” సినిమాని రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వరుస పరాజయాల నేపథ్యంలో కసితో “నవాబ్” కథ ని […]

Advertisement
Update: 2018-10-02 02:16 GMT

సీనియర్ డైరెక్టర్ మణిరత్నం నుంచి ఎన్ని బ్లాక్ బస్టర్స్… ఎన్ని క్లాసిక్స్ వచ్చాయి అనేది ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. అయితే గత కొంతకాలంగా మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి. దాంతో ఈ డైరెక్టర్ సినిమాలో నటించడానికి కొంతమంది స్టార్స్ భయపడేవారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఉన్నాడు.

“నవాబ్” సినిమాని రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వరుస పరాజయాల నేపథ్యంలో కసితో “నవాబ్” కథ ని రాసుకున్న మణిరత్నం… ఈ సినిమాలో శింబు నటించిన పాత్రలో రామ్ చరణ్ తో చేయించాలని అని చెప్పి హైదరాబాద్ కి వచ్చి చరణ్ కి ఈ సినిమా కథని వినిపించాడు. అయితే కథ విని శింబు పాత్ర లో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో ప్రేక్షకులు పైగా మెగా ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సున్నితంగా తిరస్కరించాడట చరణ్. కానీ ఇప్పుడు “నవాబ్” సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ గా నిలిచింది. పైగా సినిమాలో శింబు పాత్రకి మంచి ఆదరణ కూడా లభిస్తుంది.

Tags:    
Advertisement

Similar News