సినిమా కోసం సిగరెట్ అలవాటు చేసుకున్న నబా నటేష్

సుధీర్ బాబు హీరోగా నటించిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా నటించి తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ భామా. అయితే ఈ భామ ఒక టైం లో సిగరెట్స్ కి ఎక్కువ బానిస అయ్యిందట. గతంలో ఓ సినిమా కోసం నిజంగానే సిగరెట్ తాగే అలవాటు చేసుకున్నానని, అవి అలవాటు కావడం వల్ల అన్నం కూడా సహించేది కాదని, అయినా పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి చేయక […]

Advertisement
Update: 2018-10-02 01:27 GMT

సుధీర్ బాబు హీరోగా నటించిన “నన్ను దోచుకుందువటే” సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా నటించి తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ భామా. అయితే ఈ భామ ఒక టైం లో సిగరెట్స్ కి ఎక్కువ బానిస అయ్యిందట. గతంలో ఓ సినిమా కోసం నిజంగానే సిగరెట్ తాగే అలవాటు చేసుకున్నానని, అవి అలవాటు కావడం వల్ల అన్నం కూడా సహించేది కాదని, అయినా పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి చేయక తప్పలేదు అని చెప్పుకొచ్చింది ఈ కన్నడ భామ.

డైరెక్టర్ సిగరెట్ తాగమని కోరకున్న కూడా తన పాత్ర బాగా రావాలి అనే ఉద్దేశంతో ఆ పాత్రలో రెచ్చిపోయి నటించింది నబా నటేష్. ఆ సినిమా పేరే “వజ్రకాయ”. కన్నడ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇంట్రో సాంగ్ లో మాస్ మహారాజ్ రవితేజ కూడా కనిపిస్తాడు. అందులో కాస్త మొరటుగా ఉండే పాత్రకోసమే నభా నటేష్ సిగరెట్ అలవాటు చేసుకుంది. ఆ సినిమాలో తన పాత్ర యొక్క స్వభావం తను పలికించిన హావభావాలు నచ్చే సుధీర్ బాబు సినిమాకి తనని సెలెక్ట్ చేసుకున్నారు అని తెలిపింది.

Tags:    
Advertisement

Similar News