పెట్రోల్‌ కొట్టి... నాట్లు వేసి...

ఈ మధ్యే నగరి నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుని వీలైనంత వరకు స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉంటున్న రోజా.. రోజూ ఏదో కార్యక్రమంతో బిజీగా ఉంటున్నారు. స్థానికంగా అధికంగా ఉండడంతో… స్థానికులు కూడా ఆమెను కలిసేందుకు వస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజా ప్రజల తరపున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజవర్గంలోని మేళ్లపట్టు గ్రామంలో రోడ్లను ఆమె పరిశీలించారు. రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకు […]

Advertisement
Update: 2018-09-19 05:12 GMT

ఈ మధ్యే నగరి నియోజకవర్గంలో సొంత ఇల్లు నిర్మించుకుని వీలైనంత వరకు స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉంటున్న రోజా.. రోజూ ఏదో కార్యక్రమంతో బిజీగా ఉంటున్నారు. స్థానికంగా అధికంగా ఉండడంతో… స్థానికులు కూడా ఆమెను కలిసేందుకు వస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకుంటున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న రోజా ప్రజల తరపున నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజవర్గంలోని మేళ్లపట్టు గ్రామంలో రోడ్లను ఆమె పరిశీలించారు. రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వానికి కళ్లు తెరిపించేందుకు నడిరోడ్డుపై మహిళలతో కలిసి నాట్లు వేశారు రోజా.

తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక ఇతర గ్రామాల్లో రోడ్ల దుస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రోజా వ్యాఖ్యానించారు. తానొచ్చాక లక్షల కిలోమీటర్ల మేర గ్రామాల్లో రోడ్లు వేశామని చెప్పుకుంటున్న లోకేష్ ఇలాంటి రోడ్లను చూసి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పర్యటనలో భాగంగా నగరిలో ఒక పెట్రోల్ బంక్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. కాసేపు వాహనాలకు పెట్రోల్‌ కొట్టారు.

Tags:    
Advertisement

Similar News