సమావేశం నుంచి వెళ్లిపోయిన వంగవీటి రాధా

విజయవాడ వైసీపీలో కొత్త చిక్కు వచ్చిపడింది. ”కావాలి జగన్… రావాలి జగన్” కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఏ నియోజకవర్గంలో ఎవరు బాధ్యతలు నిర్వహించాలన్న దానిపై పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విజయవాడలో వైసీపీ ట్రేడ్‌ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలపై చర్చించారు. విజయవాడ సెంట్రల్ నియోజవర్గం బాధ్యతలను మల్లాది విష్ణు […]

Advertisement
Update: 2018-09-17 07:50 GMT

విజయవాడ వైసీపీలో కొత్త చిక్కు వచ్చిపడింది. ”కావాలి జగన్… రావాలి జగన్” కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఏ నియోజకవర్గంలో ఎవరు బాధ్యతలు నిర్వహించాలన్న దానిపై పార్టీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విజయవాడలో వైసీపీ ట్రేడ్‌ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారధి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలపై చర్చించారు.

విజయవాడ సెంట్రల్ నియోజవర్గం బాధ్యతలను మల్లాది విష్ణు చూసుకుంటారని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ బాధ్యతలు వెల్లంపల్లి శ్రీనివాస్‌కేనని మరోసారి స్పష్టం చేశారు. వంగవీటి రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా సూచించారు. లేదంటే విజయవాడ తూర్పు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే విజయవాడ సెంట్రల్‌ సీటు ఆశిస్తూ వచ్చిన వంగవీటి రాధా… ఈ కొత్త ప్రతిపాదనతో నొచ్చుకున్నారు.

సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన బ్రహ్మణ సమ్మేళంలో బ్రహ్మణులకు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికే గుంటూరు జిల్లా బాపట్ల నుంచి కోన రఘుపతి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు అదే స్థానం కేటాయించే అవకాశం ఉంది. ఇక మరోస్థానం కింద మల్లాది విష్టుకు విజయవాడ సెంట్రల్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ బ్రహ్మణుల సంఖ్య అధికంగా ఉండడంతో మల్లాదికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వంగవీటి రాధా మచిలీపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి అంగీకరిస్తారా లేక… విజయవాడ తూర్పు బాధ్యతలు తీసుకుంటారా లేక మరేదైనా ఆలోచన చేస్తారా అన్నది చూడాలి.

Advertisement

Similar News